Mirai Movie: ‘మిరాయ్’‌లో మనోజ్ పాత్ర మిస్సైన హీరో అతనే!
Mirai Movie Still
ఎంటర్‌టైన్‌మెంట్

Mirai Movie: ‘మిరాయ్’‌లో మంచు మనోజ్ చేసిన పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai Movie: సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన ‘మిరాయ్’ (Mirai Movie) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఆ అంచనాలను అధిగమించి, కలెక్షన్లను రాబడుతోంది. వీక్ డేస్‌లోనూ ఈ సినిమాకు చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నారంటే.. ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించడంతో.. ముందుగా ఈ సినిమా ఆఫర్ వచ్చి, వదులుకున్న వాళ్లంతా ఫీలవుతున్నారని తెలుస్తోంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) ఈ సినిమా కథను తేజ సజ్జా కంటే ముందు.. ఇండస్ట్రీలోని చాలా మంది హీరోలకు వినిపించాడట. అందరూ నో చెప్పారట. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ఓకే చెప్పి, ఆ తర్వాత రెమ్యూనరేషన్ సెట్ కాకపోవడంతో తప్పుకున్నాడనేలా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తేజ సజ్జా ప్లేస్‌లో నాని చేయాల్సి ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇలాంటి వార్తే మరొకటి బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే..

Also Read- OG Movie: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సెన్సార్ పూర్తి.. ఇక రికార్డులు బద్దలే!

విలన్‌గా ఆ హీరోని అనుకున్నారట..

నేచురల్ స్టార్ నాని సంగతి ఇలా ఉంటే.. మరో హీరో కూడా ఈ సినిమా అవకాశాన్ని మిస్ అయినట్లుగా టాక్ నడుస్తుంది. అదీ కూడా మంచు మనోజ్ చేసిన విలన్ పాత్రను మిస్సవడం అంటే మాములు విషయం కాదు. ఇంతకీ ఆ పాత్రను మిస్ అయిన హీరో ఎవరో తెలుసా.. సందీప్ కిషన్ (Sundeep Kishan). అవును ఈ విషయం స్వయంగా ‘మిరాయ్’ సినిమాలో బ్లాక్‌ స్వార్డ్ పాత్రను పోషించిన మంచు మనోజ్ చెప్పడం విశేషం. తాజాగా ఆయన తన పాత్రపై వివరణ ఇస్తూ.. ‘మిరాయ్’లో నేను చేసిన పాత్రకు ఫస్ట్ ఛాయిస్ నేను కాదు. దర్శకనిర్మాతలు దృష్టిలో ఈ పాత్రను సందీప్ కిషన్‌తో చేయించాలని ఉంది. వాళ్లు సందీప్ పేరుని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న సమయంలో.. తేజ సజ్జా నా పేరుని సూచించాడు. తేజ చెప్పడంతో కార్తీక్ కూడా మరోసారి ఆలోచించి, వెంటనే నన్ను అప్రోచ్ అయ్యాడు. కథ వినగానే కాదనలేకపోయాను. అలా నేను ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యానని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

Also Read- Sekhar Kammula: ఇలాంటి సినిమాలు నిర్మించ‌డానికి ధైర్యం ఉండాలి.. యంగ్ హీరో సినిమాపై ప్రశంసలు

లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ

ఇక మంచు మనోజ్ (Manchu Manoj) ఈ విషయం చెప్పినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో ఈ పాత్ర గురించి డిష్కషన్ నడుస్తోంది. నిజంగా సందీప్ కిషన్ ఈ పాత్రను చేసి ఉంటే.. అనేలా కొందరు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్ ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్టయ్యారు. సందీప్ కిషన్ అయితే అంతగా ఆ పాత్ర ఎలివేట్ అయ్యేది కాదని.. నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ చేయలేడు అని కాదు కానీ, నిజంగా మంచు మనోజ్ ఆ పాత్రకు బాగా కుదిరాడని మాత్రం చెప్పుకోవచ్చు. అందులోనూ లాంగ్ గ్యాప్ తర్వాత మంచు మనోజ్‌‌కు ఈ సినిమాతో సాలిడ్ ఎంట్రీ లభించింది. ఈ సినిమా కంటే ముందు ‘భైరవం’ (Bhairavam Movie) వచ్చినప్పటికీ, ముందు ఓకే చెప్పిన సినిమా ఇదే కాబట్టి.. ఇదే అతని రీ ఎంట్రీ ఫిల్మ్‌గా మనోజ్ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మనోజ్ నటుడిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: సీఎంగా ప్రమాణ స్వీకారం కోసం కేటీఆర్ కొత్త బట్టలు కుట్టించుకున్నాడు: సీఎం రేవంత్ రెడ్డి

KCR: ఈ రోజు వరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క: గులాబీ అధినేత కెసిఆర్

Anil Ravipudi: ‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు.. అనిల్ రావిపూడి పోస్ట్ వైరల్!

Kiara Advani: ‘టాక్సిక్‌’లో కియారా అద్వానీ.. రాకింగ్ ఫస్ట్ లుక్ చూశారా!

Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే? తనూజ రాంగ్ డెసిషన్!