OG Movie
ఎంటర్‌టైన్మెంట్

OG Movie: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సెన్సార్ పూర్తి.. ఇక రికార్డులు బద్దలే!

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (OG Movie) చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి ‘యుబైఏ’ (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అనుమానాలకు తెరదించినట్లయింది. అంతేకాదు, సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు మార్గం సుగమమైంది. వాస్తవానికి ఈ సినిమా విడుదలపై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగేలా, కొందరు సోషల్ మీడియాలో రకరకాలుగా ట్వీట్స్ వేస్తున్నారు. ఈ రోజు సినిమా సెన్సార్‌కు వెళుతుంటే.. హీరోకు కొంత పోర్షన్ నచ్చలేదని, రీ షూట్ చేస్తున్నారని కన్ఫ్యూజ్ చేసేలా కొన్ని ట్వీట్స్ దర్శనమిచ్చాయి. దీంతో ఫ్యాన్స్ మరోసారి నిరాశకు లోనయ్యారు.

Also Read- Sekhar Kammula: ఇలాంటి సినిమాలు నిర్మించ‌డానికి ధైర్యం ఉండాలి.. యంగ్ హీరో సినిమాపై ప్రశంసలు

ఇక థియేటర్లలోకి రావడమే ఆలస్యం

అలాగే మంగళవారం కూడా ఈ సినిమాపై ఓ రూమర్ సంచరిస్తుంటే.. స్వయంగా మేకర్స్ కలగజేసుకుని, ఆ రూమర్ క్రియేట్ చేసిన వారికి ఇచ్చిపడేశారు. ఇలాంటి రూమర్స్ వచ్చిన వెంటనే మేకర్స్ రియాక్ట్ అవుతున్న తీరుతో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా.. సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది కాబట్టి.. ఇక థియేటర్లలోకి రావడమే ఆలస్యం. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని తెలిసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా.. ‘ఓజీ వస్తున్నాడు.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో’, ‘ఇక రికార్డులు బద్దలే’ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. వారం ముందే సెన్సార్ పూర్తయింది కాబట్టి.. విడుదల విషయంలో ఇక ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, అనుకున్న టైమ్‌కి, వెళ్లాల్సిన చోటకి బాక్సులు వెళ్లిపోతాయని.. మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చినట్లయింది.

Also Read- Viral News: సినిమా పిచ్చోళ్లు అంటే వీళ్లేనేమో.. టికెట్ల కోసం 7 ఏళ్ల బిడ్డను వదిలేశారు!

ఇక ప్రమోషన్స్‌పై దృష్టి

దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు నెలకొన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనుండగా, ఆయన స్టైలిష్ లుక్‌లు, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు సెన్సార్ ఎలాంటి సర్టిఫికెట్ వస్తుందో అని టెన్షన్ పడుతున్న అభిమానులంతా, యుబైఏ వచ్చిందని తెలిసి.. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పండగకి ‘ఓజీ’ జాతరే అనేలా వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య, కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించారు. శరవేగంగా సెన్సార్ పూర్తి చేసుకోవడతో.. ‘ఓజీ’ చిత్ర బృందం ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టబోతుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అంచనాలకు మించి విజయం సాధిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pawan Kalyan: ప్రకృతితో చెలగటాలు ఆడొద్దు అంటున్న నెటిజన్స్

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు