The Great Pre Wedding Show
ఎంటర్‌టైన్మెంట్

Sekhar Kammula: ఇలాంటి సినిమాలు నిర్మించ‌డానికి ధైర్యం ఉండాలి.. యంగ్ హీరో సినిమాపై ప్రశంసలు

Sekhar Kammula: సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చిత్రాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అలాంటి దర్శకుడు.. ఇలాంటి సినిమాలు చేయడానికి, నిర్మించడానికి ధైర్యం కావాలని అన్నారంటే.. ఆ సినిమాలో ఉన్న విషయం ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెర్సటైల్ యాక్ట‌ర్ తిరువీర్‌ (Thiruveer) హీరోగా, టీనా శ్రావ్య (Teena Sravya) హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (The Great Pre-Wedding Show). 7 పిఎమ్ ప్రొడ‌క్ష్స‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సందీప్ అగ‌రం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 7న రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ టీజ‌ర్‌ను విడుదల చేసింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా టీజర్‌ని రిలీజ్ చేస్తే.., సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల.. టీజర్ రిలీజ్ వేడుకలో ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. సినిమా యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.

Also Read- Junior OTT: ‘జూనియర్’ ఓటీటీలోకి వస్తోంది.. శ్రీలీల ఫ్యాన్స్‌కు ‘పండగే’!

ఇదొక స్పెష‌ల్ ఫిల్మ్ అనేది అర్థమైంది

‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే నాకు తిరువీర్ గురించి తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను చాలా సంతోషపడుతుంటాను. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ చాలా ఆసక్తికరంగా, చల్లటి గాలి మనసుని హత్తుకున్నట్లుగా ఉంది’ అని విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్‌ని అభినందించారు. ఇక ఈవెంట్‌లో టీజర్‌ని విడుదల చేసిన అనంతరం శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మాట్లాడుతూ.. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజ‌ర్‌ను విడుదల చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా టీమ్ మొత్తం యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్‌గా క‌నిపిస్తోంది. అంద‌రిలో కూడా మంచి వైబ్ ఉంది. టీజ‌ర్ అంతా కూడా స‌ర‌దాగా సాగిపోయింది. తిరువీర్ ఈ మధ్య నేను చూస్తున్న వారిలో ప్రామిసింగ్ హీరో అని చెప్పగలను. టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓన్‌గా ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. నన్ను ఈ వేడుకకు పిలిచినప్పుడే ఇదొక స్పెష‌ల్ ఫిల్మ్ అనేది అర్థమైంది. తీరువీర్‌కు ప్రీ వెడ్డింగ్ షో వంటి మ‌రిన్ని మంచి సినిమాలు రావాలలి కోరుకుంటున్నాను. హీరోయిన్ చాలా నేచుర‌ల్‌గా క‌నిపించింది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించ‌డానికి నిర్మాతకు ధైర్యం, ప్యాష‌న్ ఉండాలి. ఈ సినిమా నిర్మాత‌ల‌ను చూస్తుంటే నా ‘డాల‌ర్ డ్రీమ్స్‌, ఆనంద్’ రోజులు గుర్తొచ్చాయి. కంప్లీట్ క్లీన్ ఫిల్మ్ అని తీరువీర్ చెప్పాడు. బ్యాక్‌డ్రాప్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీజ‌ర్‌ను చూడ‌గానే సినిమా చూడాలనేంత క్యూరియాసిటీని కలిగిస్తోంది. ద‌ర్శ‌కుడు తన మార్కు ఏంటో చూపించాడు. ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

Also Read- Telangana Tourism: హైదరాబాద్​‌లో 12 వారసత్వ కట్టడాల అభివృద్ధికి ప్రణాళికలు.. అవి ఏమిటంటే..?

టీజర్‌ని గమనిస్తే..

‘ఇదే అన్నా మా ఊళ్లో రమేష్ ఫొటో స్టూడియో’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ‘ఈ మండలం మొత్తంలో బర్త్‌డే అయినా, వెడ్డింగ్ అయినా, ప్రీ వెడ్డింగ్ అయినా మన దగ్గరే చేయించుకుంటారన్నా..’ అనే డైలాగ్‌తో హీరో క్యారెక్టరైజేషన్‌‌ని తెలియజేశారు. ‘అరే ఈ లైట్ అక్కడ పెట్టు’ అంటూ హీరోయిన్ ముందు హీరో ఇచ్చే బిల్డప్.., ‘ఏమండీ మీ ఫొటో తీసుకుని మా గ్యాలరీలో పెట్టుకోవచ్చా’ అని హీరోయిన్‌ని హీరో అడగితే.. దానికి హీరోయిన్ ‘నా ఫొటో ఎందుకు’ అని అడగటం.. దానికి సమాధానంగా హీరో ‘అంటే మీరు బావుంటారు కదా’ అని సమాధానం చెప్పగానే.. ‘ఏశావులే సోపు’ అని వ్యంగ్యంగా కౌంటర్ ఇవ్వటం అన్నీ కూడా చాలా నేచురల్‌గా ఉండటం విశేషం. ఫొటోగ్రాఫర్ అయిన హీరో ఓ ప్రీ వెడ్డింగ్ షూట్‌కి ఒప్పుకోవటం.. పెళ్లి కూతురు తల్లి కండీషన్స్‌తో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసే హీరోని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు.. కామెడీని పండిస్తున్నాయి. ఇక టీజర్ చివరలో ‘ఈ డ్రెస్ బావుందారా’ అని హీరో అడిగితే, అతని అసిస్టెంట్ ‘హీరోలా ఉన్నావన్నా’ అని అనగానే.. హీరో షాక్ అవటం వంటి ఫన్నీ సీన్స్.. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని క్లారిటీగా చెప్పేస్తున్నాయి. ఓవరాల్‌గా అయితే, మరో ప్యూర్ కంటెంట్ సినిమా రాబోతుందనే ఫీల్‌ని ఇస్తున్నాయి. న‌వంబ‌ర్ 7న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?