Junior OTT: గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటీ (Kireeti Reddy) హీరోగా, డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించిన ‘జూనియర్’ (Junior Movie) సినిమా థియేటర్లలో అంత గొప్పగా సక్సెస్ సాధించలేదనే విషయం తెలిసిందే. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 18న థియేటర్లలోకి వచ్చింది. మాములుగా అయితే ఈపాటికే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయాలి. కానీ, రెండు నెలలైనా ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడంతో.. ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. రాబోయే దసరా పండుగను పురస్కరించుకుని, ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని, రైట్స్ తీసుకున్న ఓటీటీ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో, ఎప్పుడు వస్తుందనే వివరాల్లోకి వెళితే..
Also Read- Vijay And Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికకు పిల్లలు కూడా పుట్టారా.. ఫ్యామిలీ ఫొటో వైరల్
శ్రీలీల ఫ్యాన్స్‌కు పండగే..
ఈ సినిమాలోని ‘వైరల్ వయ్యారి’ పాట ఓ ఊపు ఊపేసిన విషయం తెలియంది కాదు. ఈ పాట కోసం సినిమా చూసిన వాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ పాటలో శ్రీలీలతో హీరో కిరీటీ కూడా అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ పాట ఇప్పటికీ వినబడుతూనే ఉందంటే.. పాటకున్న పవర్, శ్రీలీల గ్లామర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే అంటుంది.. ఈ దసరాకు శ్రీలీల అభిమానులకు పండగే అని. అవును.. దసరా ఫెస్టివల్‌ను పురస్కరించుకుని.. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ఆహా ఓటీటీ (Aha Ott)లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓటీటీ రైట్స్‌ని ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో బొమ్మరిల్లు జెనీలియా సౌత్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read- Stray Dogs: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఒకే కుక్క రెండు సార్లు కరిస్తే జీవిత ఖైదు
‘జూనియర్’ కథ ఇదే..
‘జూనియర్’ కథ విషయానికి వస్తే.. అభి (కిరీటి)కి తన లైఫ్‌ని సరదాగా లీడ్ చేయాలని ఉంటుంది. ఈ క్రమంలో అతను స్ఫూర్తి (శ్రీలీల) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. స్ఫూర్తి ప్రేమించడానికి, ఆమె ప్రేమను పొందడానికి, ఆమె పని చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ కంపెనీ బాస్ విజయ సౌజన్య (జెనీలియా).. అభిని అనుక్షణం ద్వేషిస్తుంటుంది. విజయ సౌజన్యకు, అభికి ఉన్న సంబంధం ఏమిటి? ఆమెతో కలిసి అభి విజయనగరం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ‘బాహుబలి’ ఫేమ్ సెంథిల్ సినిమాటోగ్రఫీ అందించగా, సాయి కొర్రపాటి నిర్మించారు. మరి థియేటర్లలో ఆడియెన్స్ ఆదరణను రాబట్టుకోలేకపోయిన ఈ సినిమా, ఓటీటీలో ఎలాంటి ఆదరణను పొందుతుందో చూడాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఆహా ప్రకటించనుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు