Hyderabad Rains: గ్రేటర్ హైదరాబాద్ ను కురిసిన వర్షం (Hyderabad Rains) ముంచెత్తింది. తక్కువ సమయంలో ఎక్కువ శాతం వర్షం దంచి కొట్టడంతో మెయిన్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ గోదారిని తలపించాయి. ఉదయం నుంచి ఉప్పల్, ఆల్వాల్, సాయంత్రం సమయంలో ఎల్బీనగర్, (LB Nagar) వనస్ధలిపురం ప్రాంతాల్లో ఓ మోస్తారు కురిసిన వర్షం రాత్రి తొమ్మిది గంటల కల్లా తీవ్ర రూపం దాల్చి తక్కువ సమయంలో రికార్డు స్థాయిలో దంచి కొట్టింది. దీంతో రాకపొకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. ముఖ్యంగా బస్తీలు, లోతట్టు ప్రాంతాలు భయంతో బిక్కుబిక్కుమన్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి, సెల్లార్లలోకి నీరు రావటంతో రాకపోకలు సాగించే వాహనదారులు. పాదచారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
Also Read: Gadwal Collectorate: గద్వాల ప్రజాపాలన వేదికపై ఉద్రిక్తత.. గ్రంథాలయ చైర్మన్ ఆవేశం
గరిష్టంగా మియాపూర్ లో 12.1 సెం.మీ.లు
మియాపూర్ లో గరిష్టంగా 12.1 సెం.మీ.ల వర్షపాతం నమోదు కాగా, మియాపూర్ లో 11.1 సెం.మీ.లు లింగంపల్లిలో 10 సెం.మీ.ల వర్షపాతం నమోదై కాగా, అత్యల్పంగా సికిందరాబాద్ సీతాఫల్ మండి ప్రాంతంలో 8.3 సెం.మీ.ల వర్ష పాతం నమోదైనట్లు తెలిసింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, పిల్మ్ నగర్ , షేక్ పేట్, పటాన్ చెరు, బీహెచ్ఈఎల్, సైదాబాద్, అత్తాపూర్, మణికొండ, ఉప్పల్, నాచారం, జీడిమెట్ల, బాలానగర్ కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఆకస్మికంగా వర్షం దంచి కొట్టింది. సాధారణంగా హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న వరద నీటి కాలువలు నిజాం కాలం నాటివే. అప్పటి జనాభా ప్రకారం నిర్మించినవి కావటంతో ఈ వరద నీటి కాలువలు కేవలం గంట వ్యవధిలో రెండు సెంటీ మీటర్ల వర్షపాతం కురిస్తేనే అతలాకులతలమయ్యేవి. కానీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి దంచి కొట్టిన వర్షం కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే మియాపూర్ లో 12.1 సెం.మీ.లు, కోర్ సిటీ లోని సీతాఫల్ మండిలో 8.1 సెం.మీ.ల వర్షం పాతం నమోదు కావటంతో రోడ్లన్నీ జలమయమై వాహనదారులు, రాకపోకలు సాగించే వారి ఇబ్బందులను అంచనా వేయవచ్చు.
అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
హైదరాబాద్(Hyderabad) లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయని, ట్రాఫిక్ కు అంతరాయం ఉన్నచోట్ల వెంటనే పోలీస్, హైడ్రా, ట్రాఫిక్ విభాగాలు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని సీఎం సూచించారు. హెచ్ఎంసీ, హైడ్రా అధికారులు వర్షం ఎక్కువ కురిసిన ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
వర్షంలోనే మేయర్ పర్యటన
తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవటంతో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం రాత్రి మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో వర్షంలోని అధికారులతో కలిసి పర్యటించారు. మాసబ్‌ట్యాంక్‌లో భారీవర్షాల సమయంలో ఫీల్డ్‌లో పరిశీలిస్తున్నారు. నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు. వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.
Also Read: Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలో కొత్తగా 24,818 రేషన్ కార్డుల మంజూరు : భట్టి విక్రమార్క