Bhatti Vikramarka ( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలో కొత్తగా 24,818 రేషన్ కార్డుల మంజూరు : భట్టి విక్రమార్క

Bhatti vikramarka: ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దీనిలో భాగంగా 2030 నాటికి 1 లక్ష 98 వేల కోట్ల పెట్టుబడితో 20వేల మెగావాట్ల పునర్వినియోగ శక్తి ఉత్పత్తి ద్వారా 1,14,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ద్వారా 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి ప్రణాళికలు చేపట్టామన్నారు. ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద 2025- 26 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో 550 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్న మంది తెలిపారు.

 Also  Read: Most Expensive Cruise: ప్రపంచంలోనే లగ్జరీ క్రూయిజ్.. ఒక్కో టికెట్ రూ.7 కోట్లు.. ఎందుకంత స్పెషల్?

కుటుంబ సభ్యులు ఉచితంగా రేషన్

పేదల సంక్షేమ పథకాలు అందించడంలో రేషన్ కార్డుల పాత్ర చాలా కీలకమైందని గత పది సంవత్సరాలుగా నిరుపేదలకు రేషన్ కార్డులు (Ration cards) జారీలో అప్పటి పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ విషయాన్ని ప్రజా ప్రభుత్వం గమనించి అర్హులైన పేద కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేసి ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు నూతనంగా 24, 818 మంది కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేశామని దాని ద్వారా 1 లక్ష 3 వేల 166 కుటుంబాలు కుటుంబ సభ్యులు ఉచితంగా రేషన్ పొందుతున్నారన్నారు. ఆర్ధిక స్థితిగతులను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన అభయ హస్తం గ్యారంటీ పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి,500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వము అమలు చేస్తుందని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 4 కోట్ల 44 లక్షల48 వేల224 ఉచిత బస్సు ప్రయాణాలు చేయడం వల్ల మహిళలు 209 కోట్ల 21 లక్షల 46 వేల రూపాయలు ఆదా చేశారు అన్నారు.

 Also Read: Gowra Hari: మిరాయ్, హనుమాన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. బిజీగా మారనున్న గౌర హరి

రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద..

గృహ జ్యోతి పథకం కింద జిల్లాలో ప్రభుత్వం చే 160 కోట్ల 30 లక్షల రూపాయల సబ్సిడీ చెల్లించి 2 లక్షల43 వేల 852 కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని తెలిపారు. పేదల సొంత ఇంటి కల సాకారానికి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మండ్ల పథకాన్ని అమలు చేస్తుందని ఈ పథకంలో ఐదు లక్ష రూపాయలు ఇంటి నిర్మాణానికి పూర్తి సబ్సిడీతో లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. మొదటి విడతగా ఖమ్మం (Khammam) జిల్లాలో నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటివరకు నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాలో 122 కోట్ల 89 లక్షల జమ చేశామన్నారు.నిరు పేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఇందుకు గాను జిల్లాలో ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 10,876 మందికి వైద్య సేవలు అందించి 22 కోట్ల 90 లక్షల 57 వేల రూపాయలను ఖర్చు చేశామన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో 1 లక్ష 38వేల 790 ఎకరాల లో కొత్త ఆయకట్టును సాగు చేసి వసతి కల్పన చేస్తున్నామన్నారు.

జవహర్ ఎత్తిపోతల పథకం

రఘునాధపాలెం మండలంలో చెరువుల కింద సాగునీటి సరఫరా చేసి మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 455 ఎకరాలకు కొత్త ఆయకట్టు,1957 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పూర్తి చేశామన్నారు. మున్నేరు నది నుండి సీతారామ ఎత్తిపోత పథకం లింకు కెనాల్ పనులు 107 కోట్లతో మంజూరు చేశామన్నారు. మధిర నియోజకవర్గంలోని ఏరూరుపాలెం తోపాటు మధిర మండలాల్లో నాగార్జునసాగర్ జోన్ -3 రైతులకు సాగునీరు అందించేందుకు 630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 1257 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 70,257మంది విద్యార్థులు విద్యార్థులు ఉచితంగా విద్యను పొందుతున్నారని తెలిపారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఒక 1840 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 12,542 మంది గర్భిణీలు బాలింతలు ఆరు సంవత్సరాల లోపు వయసుగల 35,282 మంది పిల్లలకు పౌష్టికాహారంతో పాటు విద్యను అందిస్తున్నామన్నారు.

క్రిటికల్ కేర్ నిర్మాణం

ఖమ్మం జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ (R&B Department) ద్వారా 180 కోట్లతో మున్నేరు నదిపై తీగల వంతెన నిర్మాణ పనులు 130 కోట్లతో వైద్య కళాశాల భవన నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అదేవిధంగా 139 కోట్లతో పది రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారులుగా విస్తరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మధిర, సత్తుపల్లి పట్టణాల్లో 34 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ వంద పడకల ఆసుపత్రులను కల్లూరులో 10 కోట్ల 50 లక్షలతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను, పెనుబల్లిలో ఏడు కోట్ల యాభై లక్షలతో ముప్పై పడక కమ్యూనిటీ సెంటర్ ను పూర్తి చేయడం జరిగింది అన్నారు. పాలేరు (Paleru), సత్తుపల్లి (Sathupally) పట్టణాలలొ 25 కోట్ల తోపున ఖర్చు చేసి చేపట్టిన నూతన లు వైరా పట్టణంలో 37 కోట్ల 50 లక్షల ఖర్చులు చేపట్టిన 100 పడకల ఆసుపత్రి భవనం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) లో 23 కోట్ల 50 లక్షలతో చేపట్టిన క్రిటికల్ కేర్ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వన మహోత్సవం కార్యక్రమం కింద 35 లక్షల 32 వేల మొక్కలు నాటడం లక్ష్యంగా చేపట్టడం జరిగిందని ఇప్పటివరకు 29 లక్షల 100 మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.

 Also Read: Anganwadi Salary Hike: అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 18000 ఇవ్వాలి.. మంత్రి సీతక్కకు విజ్ఞప్తి

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?