Mahabubabad District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: ప్రభుత్వ అధికారుల బహిరంగ వాగ్వాదం.. బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత

Mahabubabad District: ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రజలకు పాలన అందించాల్సిన అధికారులు పనిచేసే విషయంలో వాగ్వాదానికి దిగడం ఆదివారం మహబూబాద్(Mahabubabad) జిల్లా తొర్రూరు(Thorur) పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మకు మొదటి రోజు కావడంతో పెద్ద చెరువు(Pedda Cheruvu) వద్ద బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన సమయంలో మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner) శానిటేషన్ ఇన్స్పెక్టర్(Sanitation Inspector) బహిరంగంగా మాటలు యుద్ధానికి దిగారు. ఈ సంఘటన అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మున్సిపాలిటీకి ఉన్నత స్థాయి అధికారిగా ఉన్నటువంటి కమిషనర్ ను ఇతర అధికారులు సిబ్బంది ముందు ఓ శానిటేషన్ అధికారి యూజ్లెస్ ఫెలో(Useless Fellow) అంటూ దూషించడం స్థానికంగా కలకలం రేపింది.

అధికారుల మధ్య సంఖ్యత లేకపోవడం

మహిళలు బతుకమ్మ(Bathukamma) ఆడే ప్రదేశంలో వర్షం(Rain) కారణంగా గుంతల్లో నీరు నిలించింది.యిట్టి విషయమై కమిషనర్ శానిటేషన్ అధికారిని నివేదించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారీ తీసింది. సంఘటన స్థలంలో ఉన్న పోలిసులు(Police) పరిస్థితి చేజారిపోతుందనుకోని ఇరువురికి నచ్చజెప్పారు. దింతో అధికారుల మధ్య సంఖ్యత లేకపోవడం వలనే పారిశుద్ధ్య పనుల్లో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Also Read: Telangana politics: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య వక్ఫ్​ చట్టం వార్!

ఓపిక నశించిన వృద్దుడు

ఇదిలా ఉంటే పట్టణ కేంద్రంలోని 13 వ వార్డులోని జాతీయ రహదారి పక్కన ఉన్న డ్రైనేజిని శుభ్రం చేయకపోవడం వలన చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసనతోకంపుకోడుతుంది. యిట్టి విషయమై మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోలేదు. ఓపిక నశించిన వృద్దుడు తన ఇంటి ముందు ఉన్న డ్రైనేజీని తానే స్వయంగా కాలువ తీసి శుభ్రం నీరు నిలువ లేకుండా చేసుకున్నాడు. దింతో పారిశుద్ధ్య విషయంలో అధికారుల జాప్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. కమిషనర్ మాటను ఓ శానిటేషన్ అధికారి లెక్కచేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read; BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

Just In

01

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు

Pawan Kalyan: తెలంగాణలో ఈవెంట్ పెట్టి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు.. పవన్ ని ఏకిపారేస్తున్న నెటిజన్స్

Mahabubabad District: ప్రభుత్వ అధికారుల బహిరంగ వాగ్వాదం.. బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత

MLC Kavitha: తెలంగాణ సాధించిన చంద్రునికి కొందరు మచ్చ తెచ్చారు: ఎమ్మెల్సీ కవిత