Telangana politics: వక్ఫ్ సవరణ చట్టం 2025 పై కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య విమర్శల పర్వం కొనసాగుతున్నది. రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ జరుగుతున్నది. సడన్ గా ఈ అంశంపై బీఆర్ ఎస్ వివాదాన్ని క్రియేట్ చేయడం వెనక ఎన్నికల డ్రామా ఉన్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు అసత్య ప్రచారం చేస్తూ తమ పార్టీని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ ఎస్ ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్(Congress) నేతలు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు లక్ష ఓటర్లకు పైనే ముస్లీం సామాజిక వర్గం ఉన్నది. దీంతో ఆ ఓట్ల కోసం కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) లు కొత్త డ్రామాలకు తెరలేపారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు.
పదేళ్లు పాటు మైనార్టీల పట్ల ప్రేమ చూపని కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) లు కొత్తగా ఓట్ల కోసం నటిస్తున్నట్లు టీ కాంగ్ నేతలు మండిపడుతున్నారు. సరిగ్గా జూబ్లీహిల్స్ ప్రచారంలోనే ముస్లీం సామాజిక వర్గంపై ప్రేమ చూపుతూ నటిస్తున్న కేటీఆర్ తీరును ప్రజలు గమనించాలని కాంగ్రెస్ కోరుతున్నది. కమ్మ సామాజిక వర్గం ఓట్ల కోసం చంద్రబాబు ను పొగుడుతూ, ముస్లీం ఓట్ల కోసం వక్ఫ్ చట్టం అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి బీఆర్ ఎస్ అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తుందని కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు. పదేళ్ల పాటు జూబ్లీహిల్స్ కు ఏం చేశారో? కేటీఆర్ స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. బస్తీలు, కాలనీల డెవలప్ కు సహకరించని కేటీఆర్.. ఇప్పుడు ఓట్ల కోసం తపన పడటం విచిత్రంగా ఉన్నదని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నది.
Also Read: Deepika Padukone: వరుసగా రెండో షాక్.. కల్కి 2 నుంచి దీపిక పదుకొనే ఔట్..
ఎందుకీ వివాదం..? కాంగ్రెస్ క్లారిటీ..?
తెలంగాణ కాంగ్రెస్ వక్ఫ్ సవరణ బిల్లు 2025(Waqf Amendment Bill 2025)ను తీసుకువచ్చిన తొలి ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వ్యాఖ్యలు చేశారు.అయితే ఇవి అవాస్తవాలని,ఆ వ్యాఖ్యలు వాస్తవాలకు పూర్తి విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మైనారిటీ ఓటర్లను మభ్యపెట్టేందుకు కేటీఆర్ ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి, వక్ఫ్ సవరణ చట్టం-2025 8 ఏప్రిల్ 2025న కేంద్ర ప్రభుత్వం ద్వారా అమల్లోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా దీన్ని అమలు చేయాల్సిందేనని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. అయితే ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు సీఈవోగా జాయింట్ సెక్రటరీ కంటే తక్కువ హోదాలో ఉన్న అధికారిని నియమించకూడదు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల ప్రాతినిథ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో 5 జూలై 2025న జీవో నెంబరు 54 ద్వారా అదనపు కలెక్టర్ హోదా కలిగిన మహమ్మద్ అస్సాదుల్లాను సీఈవోగా నియమించింది. ఆ తర్వాత 5 ఆగస్టు 2025న హైకోర్టు,, ఈ నియామకంపై తీర్పును వెలువరిస్తూ, కొత్త చట్టాన్ని ఉల్లంఘించి నియామకం జరిగిందని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు అనంతరం మహమ్మద్ అస్సాదుల్లాను తిరిగి వెనక్కి పంపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు సీఈవో పదవి ఖాళీగానే ఉన్నది.హైకోర్టు తీర్పు ప్రకారం జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారిని నియమించకపోవడం వలన వక్ఫ్ సవరణ చట్టం తెలంగాణలో ఇప్పటికీ అమల్లోకి రాలేదని కాంగ్రెస్ క్లారిటీ ఇస్తున్నది.
సెంటిమెంట్ రాజకీయాలు…?
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ బీఆర్ ఎస్(BRS) సెంటిమెంట్ రాజకీయానికి తెరలేపింది. కమ్మ సామాజిక వర్గం ఓటర్లను ప్రభావితం చేసేందుకు చంద్రబాబు నాయుడిపై అమాంతంగా కేటీఆర్(KTR) పొగడ్తల వర్షం కురిపించారు. ఇక మైనార్టీ ఓట్ల కోసం వక్ఫ్ చట్టాన్ని కాంగ్రెస్ కు అపాదిస్తూ, బీజేపీకి సహకరిస్తుందనే సంకేతాన్ని ఆ వర్గాల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ ఎస్ ప్లాన్ చేసింది. దీనిపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వడం వలన బీఆర్ఎస్ నాలుక కర్చుకున్నది. ఇక మాగంటి గోపినాథ్ ఫ్యామిలీ కి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అండగా ఉండాలని కేటీఆర్ కోరారు. సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదంటూ పరోక్షంగా కామెంట్లు చేశారు. ఇవన్నీ ఓట్ బ్యాంక్ కోసమే అంటూ కాంగ్రెస్ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెంటిమెంట్ తో ఓట్లను పొందలేరంటూ స్పష్టం చేసింది.
Also Read: Narayana College: నారాయణ కాలేజీలో దారుణం.. విద్యార్థి దవడ ఎముక విరిగేలా కొట్టిన ఇన్ ఛార్జ్