Narayana College: గడ్డి అన్నారంలోని నారాయణ కాలేజీలో ఫ్లోర్ ఇన్ ఛార్జ్ గా పని చేస్తున్న ఉద్యోగి రెచ్చిపోయాడు. ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన వివాదంలో జోక్యం చేసుకుని ఓ స్టూడెంట్ దవడ ఎముక(Jawbone) విరిగిపోయేలా కొట్టాడు. విషయం తెలిసి విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గడ్డి అన్నారంలోని నారాయణ కాలేజీ(Narayana College)లో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ఈనెల 15న గొడవ తలెత్తింది. ఇద్దరు వాగ్వాదం చేసుకుంటుండగా అక్కడికి ఫ్లోర్ ఇన్ ఛార్జ్ సతీష్ వచ్చాడు. అసలేం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఇద్దరినీ చితకబాదాడు. దీంట్లో సాయి పునీత్ అనే విద్యార్థి దవడ ఎముక విరిగిపోయింది. దాంతో అతని తల్లిదండ్రులు మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: OG Movie: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సెన్సార్ పూర్తి.. ఇక రికార్డులు బద్దలే!
చిత్తూరుజిల్లాలో ఓ సంఘటన
గత కొన్ని రోజులక్రితం చిత్తూరు జిల్లా(Chittoor District) పుంగనూరు(Punganuru)లో ఓ ప్రైవేటు స్కూల్లో 11 సంవత్సరాల సాత్విక నాగశ్రీ(Sattvik Nagashri) అనే విద్యార్ధి చదువుతుంది. అయితే ఈ నెల 10న తరగతి గదిలో విద్యార్థిని బాగా అల్లరి చేస్తుందని ఆ విద్యార్ధి పై కోపంతో హిందీ టీచర్ తన స్కూల్ బ్యాగ్ తీసుకొని బలంగా కోట్టాడు. దీంతో చిన్నారి తలపై గాయాలయ్యాయి. అనంతరం చిన్నారికి కొన్ని రోజుల నుండి అస్వస్ధతకు గురై స్కూలుకు రావడం మానేసింది. అయితే అదే స్కూలులో చిన్నారి తల్లీ కుడా పనిచేస్తుంది. రెండురోజులుగా తలనోప్పి, అస్వస్ధత అని అంటున్న చిన్నారిని తమ కుటుంభ సభ్యులు మోదట పుంగనూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత బాలికకు తీవ్రంగా నో ప్పివస్తువడంతో మెరుగైన వైద్యంకోసం ఆ చిన్నారిని బెంగులూరుకు తరలించారు.
అవాక్కైన తల్లి తండ్రులు
బెంగళూరులోరి ఓ ప్రైవేటు ఆసుపత్రికి చాన్నారిని తీసుకెళ్లారు. వైద్యులు చిన్నారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం తలను స్కానింగ్ చేయగా తలపై ఉన్న పుర్రెఎముక చిట్టినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అవాక్కైన తల్లి తండ్రులు చిన్నారిని అడిగి జరిగిన సంఘటన విషయాన్ని తెలుసుకున్నారు. ప్రస్ధుతం బాలికక మెరుగైన వైద్యం అక్కడే అందిస్తున్నారు. అనంతరం బాలిక తల్లితండ్రులు తీవ్ర ఆగ్రహనికి గురై విద్యార్ధి తల్లితండ్రులు మరియు వారి బంధువులు కలిసి స్కూల్ యాజమాన్యంపై సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసుకొని జరిగిన సంఘటనసై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులుల తెలిపారు.
Also Read: Strange Heist: వీడెవడండీ బాబు.. ఇలాంటి వింత దొంగను.. ఎప్పుడూ చూసి ఉండరు!