Mallu Ravi: పేద ప్రజల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి (Mallu Ravi) అన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా జిల్లా గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని, పట్టణంలోని ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో నిర్మించిన బాత్రూంలను ఎంపీ ప్రారంభించారు. అలాగే జిల్లా కలెక్టరేట్లో ఎంపీ నిధుల వినియోగంపై కలెక్టర్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి ఆయన సమీక్షించారు.
Also Read: Diwali Special Trains: దీపావళి స్పెషల్.. ఏకంగా 1,126 ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు పండగే!
ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ..
జిల్లా అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్న ఎంపీ నిధులు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులు సమర్థవంతంగా వినియోగించబడాలని స్పష్టం చేశారు. ఈ నిధులతో నిర్మాణంలో ఉన్న రహదారులు, భవనాలు, పాఠశాలలు, వసతిగృహాలు వంటి అన్ని పనులను వేగంగా మరియు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సౌకర్యం కోసం ప్రతి రూపాయి అభివృద్ధికి ఉపయోగపడేలా చూడాలని ఆయన సూచించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యాసంస్థలు, అలాగే సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతిగృహాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, సిబ్బంది పోస్టుల వివరాలను సమీక్షించారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ ఖాళీలు వెంటనే భర్తీ కావాల్సిన అవసరం ఉందని ఎంపీ గుర్తుచేశారు. గురుకులాల వారీగా ఖాళీల స్థితి నివేదికలు సమర్పించిన అధికారులకు, రాబోయే నెల రోజుల్లో అన్ని ఖాళీలను భర్తీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. విద్యా రంగం బలోపేతం కావడానికి మరియు సంక్షేమ వర్గాల విద్యార్థులకు మరింత సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వ పథకాలతో పాటు ఎంపీ నిధులు, కార్పొరేట్ నిధులు కూడా సక్రమంగా వినియోగించబడాలని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యం కాకుండా సమయానికి పూర్తి కావాలని, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులను మల్లు రవి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ…
నాగర్‌కర్నూల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా వివరించారు. ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా మంజూరైన విభిన్న శాఖల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తోందని చెప్పారు. ప్రజలకు తక్షణం ఉపయోగపడే ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రత్యేక మానిటరింగ్ మెకానిజం రూపొందించి, ప్రతి దశలో పురోగతిని సమీక్షిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Also Read: Gold Rate Today: పండుగ ముందు మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..