KGBV Workers (image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

KGBV Workers: కేజీబీవీ వర్కర్లకు కనీస వేతనం రూ.26,000 వేలు ఇవ్వాలి.. టియుసిఐ డిమాండ్

KGBV Workers: కేజీబీవీ వర్కర్లకు (KGBV Workers) కనీస వేతనం రూ. 26,000 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ (KGBV Non-Teaching Workers) అసోసియేషన్ (టియుసిఐ) జిల్లా గౌరవ అధ్యక్షులు ఆవుల అశోక్,సంఘ అధ్యక్షులు జ్యోతి కోరారు. పాతలింగాల కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ..సిబ్బందికి పని భారం తగ్గించాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులు భర్తీ చేయాలని, వర్కర్లకు నైట్ డ్యూటీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 Also Read: Shabana Azmi: పుట్టింది స్టార్ కుటుంబంలో.. అయినా టీ అమ్మింది.. కట్ చేస్తే అయిదు జాతీయ అవార్డులు

వర్కర్ల జీవితాల్లో వెలుగులు లేవు

రాష్ట్ర వ్యాప్తంగా 475 కేజీబీవీ పాఠశాలలో వేలాది మంది వర్కర్లు, నాన్ టీచింగ్ వెట్టి పని చేస్తూ విద్యార్థిని విద్యాభివృద్ధికి దోహదపడుతున్న వర్కర్ల జీవితాల్లో వెలుగులు లేవు అన్నారు. దుర్భరమైన బతుకులు బ్రతుకుతూ కనీస వేతనాలకు నోచుకోకుండా, హక్కులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పని చేయించుకుంటుందని అన్నారు. సుప్రీం కోర్ట్ 2016 లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చిన ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడం శోచనీయమన్నారు.

రూ. 9,750 జీతం

రోజు 12 గంటల నుండి 14 గంటలు వరకు పని చేస్తున్న వీరికి మాత్రం రూ. 9,750 జీతం ఇవ్వడం తగునా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేజీబీవీ వర్కర్ల (KGBV Workers) )సమస్యల సాధనకై ఈనెల 22న చలో ఎస్ పి డి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ జ్యోతి, ఏఎన్ఎం నాగేంద్ర, కంప్యూటర్ ఆపరేటర్ లక్ష్మి, అనిత, సునిత ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Kishan Reddy: కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందాల్సిందే.. మంత్రి ఆదేశం

ఈనెల 23న జరిగే హమాలి కార్మికుల..  మహాసభను జయప్రదం చేయండి

ఇనుగుర్తి మండల కేంద్రంలో హామాలి కార్మికుల సమావేశం అల్లపు రాములు అధ్యక్షతన జరిగిన సమావేశానికి సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజు పాల్గొని మాట్లాడుతూ.. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుండా పాలకులు హమాలి కార్మికులను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మహాసభను జయప్రదం చేయాలి

ఈనెల 23న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే హమాలి కార్మికుల జిల్లా మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బండి సత్యం, హమాలి కార్మికులు మాలి జంపయ్య, పెంతల బుచ్చయ్య, కొంతం నరసయ్య, బొల్లు కృష్ణ, కుల్ల సాంబయ్య, సంగం రమేష్, సంగం సైదులు, ఉప్పలయ్య, యాకయ్య, మామిడి చంద్రమౌళి, బొల్లు హరీష్, మాలోతు వీర్య, ముసుకు వెంకన్న పాల్గొన్నారు.

 Also Read: Bandla Ganesh: ఈ మాఫియా నిన్ను బతకనివ్వదు.. లిటిల్ హార్ట్స్ హీరోకి సినిమా పాఠాలు నేర్పిస్తున్న బండ్ల గణేష్?

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఇనుగుర్తి మండల ఎంఈఓ జే రూపారాని అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 69వ ఎస్ జి ఎఫ్ ఐ మండల స్థాయి అండర్ -14,17 విభాగాల నుంచి బాల, బాలికల కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడ ఎంపికల పోటీలను ఎంఈఓ రూపా రాణి, ఎస్ జి ఎఫ్ ఐ జిల్లా సెక్రటరీ జి. సత్యనారాయణ మరియు పెద్దిరాజు దేవేందర్, వెంకన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వీరన్న, పిడిలు ఐలయ్య, ప్రణయ్, ప్రవీణ్, మధు, కవిత, మల్లీశ్వరి, సీనియర్ క్రీడాకారులు నాగరాజ్, గణేష్, వీ రాజ్, వినయ్, పాల్గొన్నారు.

 Also Read: Telangana Police Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12,452 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Just In

01

Pawan Kalyan: ప్రకృతితో చెలగటాలు ఆడొద్దు అంటున్న నెటిజన్స్

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు