Kishan Reddy: కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ(MCRHRD)తుంగభద్ర శ్రవణ్ కుమార్ హాల్లో ఏర్పాటుచేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం(దిశ)లో ఆయన మాట్లాడారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్(Healthy Women Empowered Family Campaign) లో భాగంగా మహిళలు, బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యాధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. అలాగే హైదరాబాద్(Hyderabad) జిల్లాలో 36 అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకోనున్నట్లు మంత్రి స్పష్టంచేశారు.
Also Read; TGSRTC: దసరా, బతుకమ్మ స్పెషల్.. 7754 ప్రత్యేక బస్సులు.. టీజీఎస్ఆర్టీసీ ప్రకటన
నాలాల్లో పడి ముగ్గురు యువకులు..
హైదరాబాద్ జిల్లాలో 71,560 స్వయం సహాయక సంఘాల పనితీరు భేష్ గా ఉందని, దేశంలోని లక్నో తర్వాత తెలంగాణ(Telangana)లో స్వయం సహాయక సంఘాలు మరింత విజయపథంలో నడుస్తున్నాయని అభినందించారు. ఇదిలాఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాల సందర్భంగా ఆసిఫ్ నగర్, ముషీరాబాద్(Musheerabad) ప్రాంతంలోని నాలాల్లో పడి ముగ్గురు యువకులు కొట్టుకుపోవడం బాధాకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫ్లడ్ ఎఫెక్టెడ్(Flood Effects) ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. అంతేకాకండా ఆయా శాఖలవారీగా కలెక్టర్లతో కలిసి కిషన్ రెడ్డి(Kishan Reddy) సమీక్షించారు.
ఈ సమావేశంలో..
ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender), హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి(Collector Harichandana Dasari), ఎండీ వాటర్ వర్క్స్ అశోక్ రెడ్డి(MD Ashock Reddy), అదనపు కలెక్టర్ రెవెన్యూ ముకుంద రెడ్డి(Mukunda Reddy), అడిషనల్ కమిషనర్ జీహెచ్ఎంసీ రఘు ప్రసాద్(Ragu Prasad), జోనల్ కమిషనర్ కూకట్ పల్లి అపూర్ చౌహాన్, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ డాక్టర్ లావణ్య, సీపీవో డాక్టర్ సురేందర్, సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్?