Jogulamba Gadwal district: జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అరుదైన చికిత్స చేశారు. జిల్లా ఆసుపత్రి వైద్యులు 20 ఏళ్లుగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న మహిళకు హెర్నియ ఆపరేషన్(Hernia operation) లో భాగంగా 4 గంటల పాటు శ్రమించి ముడుచుకుపోయిన పేగులను విడదీసి ఆపరేషన్ నిర్వహించారు. సర్జరీ అనంతరం మహిళ ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అలాగే ఉమ్మ నీరు ఎక్కువగా ఉండటంతో ఓ మహిళకు ఆపరేషన్ చేసి బిడ్డకు జన్మనిచ్చిందని ఆ తర్వాత ఇబ్బంది పడటంతో మహిళ క్రిటికల్ పొజిషన్ లో ఆసుపత్రికి రాగా ఆమెకు కూడ చికిత్స చేసి ఇబ్బంది పడిన మహిళను ఆపరేషన్ చేసి సక్సెస్ చేసినట్టు వైద్యులు తెలిపారు.
కడుపులో పేగులు మడత పడి
ప్రభుత్వ జనరల్(Govt Hospital) ఆస్పత్రిలో ఇలాంటి క్రిటికల్ సర్జరీ(Critical surgery) అయిన చేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిర తెలిపారు. ఆపరేషన్(Operation) సక్సెస్ కావడం పట్ల సర్జరీ చేసిన డాక్టర్లు కేచరి, విజయ భాస్కర్, స్పందనను ఆమె అభినందించారు. ఆపరేషన్ చేయించుకున్న మహిళ గత 20 సంవత్సరాలుగా కడుపులో పేగులు మడత పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేదని, గత పది రోజులుగా మోషన్ రాకపోవడంతో ఆసుపత్రిలో ఆపరేషన్ కోసం చేరారన్నారు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ తరహా ఆపరేషన్ లు చేసేందుకు ప్రస్తుతం అనుభవం కలిగిన డాక్టర్ల బృందం అందుబాటులో ఉందన్నారు.
Also Read: Mallikarjuna Kharge: తెలంగాణలో కులగణన దేశానికి దిశానిర్దేశం!
ఇంకా వివిధ సర్జరీలు
గద రెండు నెలలుగా థైరాయిడ్(Thyroid), రొమ్ము గడ్డలు(breast lumps) తదితర సర్జరీలను చేపట్టామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న రోగులు ఇక్కడ వైద్యం పొందాలని సూచించారు. కర్నూల్, హైదరాబాద్(Hyderabad) వంటి దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాల్సిన అవసరం లేదని, ఆస్పత్రిలో గత నెలలో 16 ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించామన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న వైద్య సేవలను జిల్లా వాసులు వినియోగించుకోవాలన్నారు.
Also Read: Central govt: చెప్పులు ఆధార్ కార్డులతో రైతులు క్యూ.. అధికారుల నిర్లక్ష్యం