Sai Srineeth: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో ఇటీవల జరిగిన ఎస్.జి.ఎఫ్.(SGF) క్రీడా పోటీల్లో జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాల(Jammikunta Boys High School)కు చెందిన కె. సాయి శ్రీనిత్(sai Srineeth) (తొమ్మిదో తరగతి) రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీలో ఈ విద్యార్థి రెండవ స్థానం సాధించి పాఠశాల ప్రతిష్ఠను పెంచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాదం సురేష్ బాబు(Suresh babu) మాట్లాడుతూ.. జమ్మికుంట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల కేవలం నాణ్యమైన విద్యకే కాక, క్రీడలకు కూడా నిలయంగా మారిందని పేర్కొన్నారు. పాఠశాలలో క్రీడా నైపుణ్యాల పెంపుదల విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు.
భవిష్యత్తుకు పునాదులు..
విద్యార్థులు క్రీడా విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసేందుకు ఫిజికల్ డైరెక్టర్ (పిడి) ఎం. ప్రేమలత మేడం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. అంతేకాక, స్పోర్(Sports)ట్స్ కోటా ద్వారా విద్యార్థినీ, విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం పొందిన సాయి శ్రీనిత్‌ను ప్రధానోపాధ్యాయులు సురేష్ బాబుతో పాటు ఉపాధ్యాయులు వి. సంతోష్ కుమార్, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, fచంద్రశేఖర్, సమ్మయ్య, ప్రభాకర్, ఎం. శ్రీనివాస్, యేసుమని, వనజ, జ్యోతి, లక్ష్మీ, ఎం. స్వామి, కె. సంపత్, డి. వరదరాజు, రాం. రాజయ్య తదితర సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
Also Read: King 100 movie: నాగార్జున వందో సినిమాకు ముగ్గురు హీరోయిన్లా.. షూట్ ఎప్పటినుంచంటే?
