Jagga Reddy: నిజామాబాద్ లోని స్నేహ సొసైటీ కి చెందిన అంధుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న వికాస్ నాయక్(Vikas Nayak)కు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టిపిసిసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.వివరాలు ఇలా ఉన్నాయి.
వికాస్ నాయక్
స్వస్థలం కామారెడ్డి(Kamareddy) జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం లోంకా తాండా, మూడు సంవత్సరాల వయస్సులో అనారోగ్యం తో చూపును కోల్పోయిన వికాస్ పాటలు పాడటం, కోమరెళ్ళి మల్లన్న, బీరప్ప, రాముడు, సీత, హనుమంతుని లాంటి పౌరాణిక గాథలను కథలు, పాటల రూపంలో ధారాళంగా చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించిన వికాస్ నాయక్, టీవీ(TV)లో వచ్చే కార్టూన్ క్యారెక్టర్(Cartoon character) ల డైలాగ్స్ ను అచ్చు గుద్దినట్లు అనుకరించి చెప్పగలగడంలో నేర్పు సాధించిన వికాస్. రెండు కిడ్నీలు పాడై గత రెండు సవత్సరాలుగా తీవ్ర అనారోగ్యం బారిన పడ్డ వికాస్ నాయక్ తండ్రి జగ్గారెడ్డిని కలసి సహాయం అడగాలని తన తల్లి, తాతయ్య, అమ్మమ్మ పెద్దమ్మ లతో కలిసి సంగారెడ్డికి వచాడు.
Also Read: Konda Surekha: అటవీ అమరవీరులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. మంత్రి కొండా సురేఖ స్పష్టం
ప్రతిభను చూసి అబ్బురపడ్డ జగ్గారెడ్డి
వికాస్ నాయక్ తన కోసం, తన తండ్రి చికిత్స కోసం ఆరు లక్షల రూపాయలు అప్పు చేశామని వడ్డీతో లక్ష రూపాయలు అయ్యిందని, తమకు ఆర్థిక సహాయం చేయాలని జగ్గారెడ్డిని వికాస్ నాయక్ కోరాడు. తక్షణమే స్పందించిన జగ్గారెడ్డి 7లక్షల యాభై వేల రూపాయల నగదును జగ్గారెడ్డి అందించాడు. పాటలు, పౌరాణిక గాథల్లోని పద్యాలను అలవోకగా చెప్పిన తీరును చూసి వికాస్ నాయక్ ను జగ్గారెడ్డి అబినందించాడు. మల్లన్న, బీరప్ప వీర గాథలను రాగ యుక్తంగా ఏకధాటిగా చెప్పడంతో వికాస్ నాయక్ ప్రతిభను చూసి అబ్బురపడ్డ జగ్గారెడ్డి తాను హనుమంతుని భక్తున్నని, హనుమాన్ మాల దరించాలనుకుంటుననాని జగ్గారెడ్డికి వికాస్ నాయక్ తెలిపాడు. తానే స్వయంగా యుట్యూబ్ ఛానల్ పెట్టుకుంటానని, తనకు సపోర్ట్ చేయమని జగ్గారెడ్డిని వికాస్ నాయక్ కోరాడు.
ఇంట్లో జరిగే ప్రతీ కార్యక్రమం..
దీంతో జగ్గారెడ్డి వెంటనే కొత్త స్మార్ట్ ఫోన్ తెప్పించి ఇవ్వటమే కాకుండా యుట్యూబ్ ఛానల్ ఏర్పాటు కు సహకరిస్తానని జగ్గారెడ్డి భరోపా ఇచ్చాడు. బాగా చదువుకుని కలెక్టర్ అవుతానని జగ్గారెడ్డికి వికాస్ నాయక్ తెలిపాడు. కష్ట పడి చదువుకుని కలెక్టర్ కావాలని, మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని జగ్గారెడ్డి అన్నారు. ఇక పై తమ ఇంట్లో జరిగే ప్రతీ కార్యక్రమం లోనూ పాటలు పాడేందుకు పిలిపిస్తానని వికాస్ నాయక్ కు జగ్గారెడ్డి తెలిపాడు. స్వయంగా కారు ఏర్పాటు చేసి వికాస్ నాయక్ కుటుంబాన్ని వారి స్వస్థలానికి జగ్గారెడ్డి పంపించాడు.
Also Read: xAI Lays Offs: 500 మంది ఉద్యోగులను తొలగించిన ఎలాన్ మస్క్ కంపెనీ ‘ఎక్స్ఏఐ’.. ఎందుకంటే?