Elon-Musk-XAI
Viral, లేటెస్ట్ న్యూస్

xAI Lays Offs: 500 మంది ఉద్యోగులను తొలగించిన ఎలాన్ మస్క్ కంపెనీ ‘ఎక్స్ఏఐ’.. ఎందుకంటే?

xAI Lays Offs: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ (xAI) పెద్ద సంఖ్యలో ఉద్యోగులను (xAI Lays Offs) తొలగించింది. కంపెనీ డేటా అనోటేషన్ విభాగంలో పని చేస్తున్న 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తొలగింపునకు గురైన ఉద్యోగులు ‘జనరలిస్ట్ ఏఐ ట్యూటర్లు’గా కంపెనీలో పనిచేశారు. ఎక్స్ఏఐకి చెందిన ప్రముఖ చాట్‌బాట్ ‘గ్రోక్‌’కు ట్రైనింగ్ ఇవ్వడంలో ఈ 500 మంది ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. కంపెనీ భారీ పునఃవ్యవస్థీకరణ (restructuring) ప్రణాళికలో భాగంగా ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. ఇకపై నిపుణులైన స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లను మాత్రమే నియమించుకోవడం కంపెనీ దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.

తొలగింపునకు సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగులకు ఈ-మెయిల్‌ ద్వారా కంపెనీ సమాచారం అందించింది. సెప్టెంబర్ 12న (శుక్రవారం) రాత్రి సమయంలో ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు. నవంబర్ 30 వరకు జీతం చెల్లించనున్నట్టు ఎక్స్ఏఐ కంపెనీ భరోసా ఇచ్చింది. అయితే, సంస్థ అంతర్గత వ్యవస్థల నుంచి వెంటనే తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటికే కొంతమంది సీనియర్ ఉద్యోగుల వర్కింగ్ ఐడీలను డీయాక్టివేట్ కూడా చేసినట్టు సమాచారం.

జనరలిస్టుల తొలగించి ఎందుకు?

తొలగింపునకు గురైన డేటా అనోటేటర్లు (జనరలిస్టులు) గ్రోక్ ఏఐ (Grok AI) మోడల్‌ను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. ట్రైనింగ్ డేటా తయారు చేయడం, మోడల్ జవాబులను సరిదిద్దడం వంటి ప్రోగ్రామింగ్స్‌లో పాలుపంచుకున్నారు. సమాచార వర్గీకరణ వంటి పనులను కూడా వీరే చూసుకున్నారు. వారిలో చాలామంది గంటకు 35-65 అమెరికన్ డాలర్లు కంపెనీలో సంపాదించారు. అయితే, ఇకపై జనరలిస్టుల అవసరాన్ని తగ్గించేసి, డొమైన్ స్పెషలిస్టులను 10 రెట్లు పెంచాలని భావిస్తున్నట్టు ఎక్స్ఏఐ ప్రకటించింది.

Read Also- Hyderabad Cyber Crime: సైబర్‌ కేటుగాళ్ల చేతిలో రూ.18వేలు స్వాహా.. నిమిషాల్లోనే రికవరీ చేసిన పోలీసులు

ఎక్స్ఏఐలో ఉద్యోగుల అసంతృప్తి!

ఎక్స్ఏఐ కంపెనీలో పనితీరుపై ఈ ఏడాది ప్రారంభంలోనే ట్యూటర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏఐ ట్రైనింగ్ కోసం ఉద్యోగుల ముఖాలను స్కాన్ చేయాలని కంపెనీ కోరింది. దీనిపై కొంతమంది ఉద్యోగులు అసౌకర్యంగా ఫీలయ్యారు. అప్పట్లో ఈ ఆదేశం వివాదాస్పదంగా మారింది. కాగా, ఎలాన్ మస్క్‌ కంపెనీల్లో కఠినమైన మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయని మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. ఒక్కొక్కరిని వ్యక్తిగత సమీక్ష కోసం పిలుస్తారని, కంపెనీకి ఏ విలువను జోడించారని ఉద్యోగులను హెచ్చార్ వాళ్లు ప్రశ్నిస్తుంటారని మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. బాధ్యతగా ఉండాలనే చెప్పే ఎలాన్ మస్క్ అనుసరించే విధానం చాలా స్పష్టంగా కనిస్తుందని అంటున్నారు. టెస్లా విషయంలో ఆయన అనుసరించిన విధానాన్నే ఎక్స్ఏఐలోనూ పాటిస్తున్నారు. అమెరికా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించినప్పుడు కూడా ఆయన ఇదేవిధంగా నడుచుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

Read Also- Congress: మణిపూర్‌లో ప్రధాని పర్యటన.. లాజిక్‌ ప్రశ్నలతో ఏకిపారేసిన కాంగ్రెస్

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, ఎక్స్ఏఐ కంపెనీ ప్రస్తుతం సూక్ష్మ స్థాయి, లేదా, దీర్ఘకాల వ్యూహంతో మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏఐ, గ్రోక్‌ విషయంలో భవిష్యత్‌లో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నారు. కాగా, ఎక్స్‌ఏఐ కంపెనీ 2023లో ప్రారంభమైంది. ఓపెన్‌ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్ వంటి దిగ్గజాలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది.

Just In

01

Sai Durgha Tej: ‘విన్నర్’ సినిమా తర్వాత అలాంటి పాటలు చేయడం మానేశా..

Shankarpally Robbery Case: శంకర్‌పల్లి దారి దోపిడీ కేసు.. సంచలన విషయలు వెలుగులోకి? ఏం నటించాడు భయ్యా!

Renu Agarwal Murder Case: రేణు అగర్వాల్ హత్య కేసులో.. క్యాబ్ డ్రైవర్​ ఇచ్చిన సమాచారంతో వీడిన మిస్టరీ.. కారణాలు ఇవే?

Teja Sajja: ప్రభాస్ కారణంగానే.. ‘మిరాయ్’ సక్సెస్‌పై హీరో తేజ సజ్జా స్పందనిదే!

Viral News: ఒక మహిళ, ఇద్దరు పురుషుల్ని ఒకే స్థంభానికి కట్టేసి కొట్టారు.. కారణం ఏంటంటే?