Swetcha Effect (IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. రంగంలోకి డీసీహెచ్‌ఎస్.. వైద్యుల పనితీరుపై చర్యలు

Swetcha Effect: హుజూరాబాద్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల పనితీరు, రోగులకు సరైన సేవలు అందకపోవడంపై ‘స్వేచ్ఛ’ లో (Swetcha Effect)  ప్రచురితమైన 22 మంది వైద్యులు ఉన్న రెండు కుట్లు వేసే దిక్కే లేదు. అనే కథనానికి జిల్లా ఆరోగ్య సేవల సమన్వయకర్త (DCHS) డాక్టర్ కృష్ణ ప్రసాద్‌ స్పందించారు.  డిసిహెచ్ఎస్ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో నిర్లక్ష్యపు పని తీరుపై ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డిని మందలించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 Also Read: Student Indiscipline: పాఠశాలకు డుమ్మా ఆపై.. అల్లరి చేష్టలకు పాల్పడుతున్న విద్యార్థులు

స్వేచ్ఛ కథనం

ఆసుపత్రిలో 22 మంది వైద్యులు ఉన్నప్పటికీ, కనీసం వైద్య సేవలు అందించే వారు లేకపోవడం ఎంతని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా డీసీ హెచ్ ఎస్ మాట్లాడుతూ స్వేచ్ఛ కథనం పై స్పందించి హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించామన్నారు. ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా సూపరింటెండెంట్‌కి వార్నింగ్ ఇచ్చామన్నారు. ఆసుపత్రిలో రోగులకు అవసరమైన అదనపు సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. వైద్యుల పని తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ను గతంలో మందలించిన వారి పనితీరులో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయన్నారు. వైద్య సేవలలో ఇలాంటి ఆరోపణలు మరోసారి వస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని DCHS స్పష్టం చేశారు.

కిందిస్థాయి సిబ్బందితో వైద్య సేవలు

ఆసుపత్రిలో 22 మంది వైద్యులు ఉన్నా, ఒకరిద్దరు మాత్రమే విధుల్లో కనిపించడం, వారు కూడా రోగులకు సేవలు అందించకుండా కింది స్థాయి సిబ్బందితో పనులు చేయిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు మరోసారి తమ దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని DCHS హెచ్చరించారు. విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది రోగులకు వెంటనే సేవలందించాలని, “రేపు రండి” లేదా “మరోసారి రండి” అని చెప్పడానికి వీలు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

 Also Read: CM Revanth Reddy: విద్యారంగం స‌మూల ప్రక్షాళ‌నే మా ధ్యేయం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Just In

01

Chinmayi Sripada: మంగ‌ళ‌సూత్రం కాంట్రవర్సీ.. ట్రోలర్స్‌పై చిన్మ‌యి ఫిర్యాదు

Nizamabad Crime: రియల్ ఎస్టేట్‌లో మాఫియా లేడి.. నమ్మించి రూ.లక్షల్లో వసూలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Leopard Attack: చిరుత కలకలం.. కాపుకాసి లేగదూడపై దాడి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు

Ind vs Aus 4th T20: వారెవా.. మ్యాచ్‌ను తిప్పేసిన స్పిన్నర్లు.. నాలుగో టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ

Bigg Boss Telugu 9: సీక్రెట్ రెబల్.. హౌస్‌లో అసలు సిసలు బిగ్ బాస్ ఆట మొదలైంది