Eye liner ( Image Source: Twiitter)
Viral

Eye liner: ఐలైనర్ వాడటం మీ కళ్ళకు మంచిదేనా.. షాకింగ్ నిజాలు చెప్పిన వైద్యులు

Eye liner:  ప్రస్తుత జీవన శైలిలో అందరూ ఎవరికీ వారు బిజీగా గడుపుతున్నారు. ఇంకా కొందరైతే ఆలస్యంగా తిని పడుకుంటారు. ఇక ఆడవాళ్ళు కెమెరా ముందు అందంగా ఉండటం కోసం, మేకప్ వేసుకుంటారు. వాటిలో కళ్ళకి చాలా మంది ఐలైనర్ లు వాడుతుంటారు. అయితే. ఇది అంత మంచిది కాదని, మీకు తెలియకుండానే మీ కళ్ళకు హాని కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కళ్ళు మన ముఖంలో అత్యంత సున్నితమైన భాగాలలో ఒకటి. మేకప్ వేసుకునే టప్పుడు తప్పులు చేస్తే అది కళ్ళలోకి వెళ్లి దురదగా మారి ఎర్రగా చేస్తాయి. ” ఐలైనర్ నుండి మస్కారా వరకు చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే, కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే, ఏదైనా చిన్న తప్పు జరిగినా, దాని ఫలితం తేలికపాటి చికాకు నుండి మొదలయ్యి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ల వరకు వెళ్తుందని ” వైద్యులు ” చెబుతున్నారు.

Also Read: GHMC 1st Position: కుక్కల విషయంలో హైదరాబాద్ సంచలన రికార్డ్.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

రోజువారీ మేకప్ తప్పులు మీ కంటి ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తాయో తెలుసా?

1. కంటికి మేకప్ వేసుకుని నిద్రపోవడం వల్ల సేబాషియస్ రంధ్రాలు మూసుకుపోతాయి. దీర్ఘకాలిక తక్కువ-స్థాయి వాపుకు కారణమవుతాయి.

2. ఐలైనర్‌ను వాటర్‌లైన్‌కు పూయడం వల్ల కన్నీటి పొరలోకి వెళ్లి అక్కడ కణాలు , బ్యాక్టీరియా పదార్థం సున్నితమైన కంటిలోని కణజాలంలోకి వెళ్తుంది.

3. మురికి లేదా తిరిగి ఉపయోగించిన బ్రష్‌లు వాడటం వలన స్పాంజ్‌ల నుండి బ్యాక్టీరియా వెలువడి కండ్లకలకలు వస్తాయి.

4. వాటర్‌ప్రూఫింగ్ తయారైన లెన్స్ లను ఉపయోగించవద్దు. కాంటాక్ట్ లెన్స్ ధరించడానికి ఆమోదించబడిన, కళ్ళ డాక్టర్స్ చెప్పిన
ప్రోడక్ట్స్ మాత్రమే ఉపయోగించండి.

Also Read: Samantha and Raj Nidimoru: మ‌రోసారి అతడితో అడ్డంగా దొరికిపోయిన స‌మంత‌.. వీడియో వైర‌ల్‌..

కంటి ఆరోగ్యం కోసం చిట్కాలు:

హైపోఅలెర్జెనిక్ ప్రోడక్ట్స్ వాడండి : సున్నితమైన కళ్లకు అనుకూలమైన, అలెర్జీ రహిత ఉత్పత్తులను ఉపయోగించండి.

మేకప్ షేర్ చేయవద్దు: ఇతరులతో మీ మేకప్ బ్రష్‌లను పంచుకోవడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.

కంటి సమస్యలు ఉన్నప్పుడు మేకప్ వాడకం మానండి: కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు మేకప్ ఉపయోగించవద్దు

కంటిలో మేకప్ చేరితే: వెంటనే శుభ్రమైన నీటితో లేదా ఐ-వాష్ సొల్యూషన్‌తో కళ్లను కడగండి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్