Viral Video: కాలీఫోర్నియాలోని ఓ మాల్ లో ఏర్పాటు చేసిన అతి భారీ అక్వేరియం ఒక్కసారిగా కుప్పకూలింది. అక్వేరియం చూస్తున్న పదుల సంఖ్యలో ప్రజలపై అది పడిపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. వీడియోలోని దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయని.. చూడలేకపోతున్నామని పలువురు కామెంట్స్ సైతం చేస్తున్నారు. అదే సమయంలో ఈ వీడియో నిజమైంది కాదన్న అభిప్రాయాలు సైతం పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఇందులోని నిజానిజాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
వీడియోలో ఏముంది..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ఓ మాల్ లో భారీ అక్వేరియం ఉంది. అందులో పెద్ద, చిన్న కలిపి పదుల సంఖ్యలో చేపలు కూడా ఉన్నాయి. మాల్ కు వచ్చిన చాలా మంది ప్రజలు.. ఆసక్తిగా ఆ చేపలను వీక్షించడం వీడియోలో గమనించవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఒక్కసారిగా అక్వేరియం పగిలిపోవడంతో అందులోని నీరంతా కింద ఉన్న వీక్షకులపై పడ్డాయి. గాజు పెంకులతో పాటు భారీ ప్రవాహం మీద పడిపోవడంతో కింద ఉన్న ప్రజలంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో 50మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్లు వీడియోను వైరల్ చేస్తున్న వారు పేర్కొంటున్నారు.
View this post on Instagram
ఘటనలో వాస్తవమెంతా?
కాలిఫోర్నియాలో జరిగిన అక్వేరియం ప్రమాదం పూర్తిగా ఫేక్ అని నిర్ధారణ అయ్యింది. దానిని ఏఐ ఆధారంగా రూపొందించారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా ఈ తరహా ఘటన ఇటీవల కాలంలో చోటుచేసుకోలేదు. 2022లో బెర్లిన్ లో జరిగిన ఒక అక్వేరియం ప్రమాదాన్ని ప్రేరణగా తీసుకొని దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. వీడియోను నిశితంగా గమనించినా కూడా ఇదే విషయం అర్థమవుతోంది. ప్రమాదానికి గురైన ప్రజలు.. వీడియోలో చాలా అస్పష్టంగా ఉన్నారు. వారి శరీర ఆకృతులు సైతం భిన్నంగా ఉన్నాయి. కాబట్టి అక్వేరియం ఘటన ఫేక్ అని చెప్పవచ్చు.
Also Read: Khammam Tragedy: శవంగా తమ్ముడు.. రాఖీ కట్టిన అక్క.. గుండెలు పిండేసే దృశ్యం
ఇటీవల సింహం వీడియో సైతం..
ప్రస్తుతం ఈ తరహా ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో పెరిగిపోయాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఓ సింహం వీడియో తీవ్ర చర్చకు దారి తీసింది. సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించిన సింహం.. ఎంచెక్కా మాంసాన్ని ఆరగిస్తున్నట్లు అందులో ఉంది. ఇది నిజమనుకొని ఈ వీడియోను తెగ వైరల్ చేశారు. తీరా అది ఫేక్ అని తెలియడంతో చాలా మంది నోర్లు కరుచుకున్నారు. కాబట్టి ఈ తరహా వీడియోలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.