Annabelle in Delhi: ఢిల్లీలో హాలోవీన్ సందర్భంగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ “ది కాంజ్యూరింగ్” ఫ్రాంచైజ్‌లోని భయానక బొమ్మ అన్నాబెల్ గెటప్‌లో రోడ్లపైకి వచ్చి రచ్చ చేసింది. అలా ఆమెను చూసినవాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె మేకప్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అన్నాబెల్ లుక్‌తో ఢిల్లీలో భయానక షో
వైరల్ వీడియోలో, తెల్లని భయానక డ్రెస్, రెండు జడలు, ఎర్రగా పెయింట్ వేసుకుని.. ఒక భయంకర నవ్వుతో అన్నాబెల్ లుక్‌లో ఆ మహిళ రోడ్డు మీద నడుస్తూ కనిపించింది. చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆమెను చూసి ఒక్కసారిగా ఆగిపోయారు. మరి కొందరూ ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉన్నారు , ఇంకొందరు చూడలేక అరుస్తూ పారిపోయారు. మరికొందరు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వీడియో క్షణాల్లో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఆమెకు “Annabelle in Delhi” అనే పేరు పెట్టి వినియోగదారులు పలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఇంటర్నెట్‌లో వినియోగదారుల స్పందనలు
వీడియో కింద ఒక యూజర్ కామెంట్ చేశాడు – “Try Devil as well! మరొకరు ఇలా “Annabelle, welcome to India!” అని రాశారు. ఇంకొకరు నవ్వుతూ వ్యాఖ్యానించాడు “ఆమె చేతిలో ఉన్నది తన దూరపు బంధువు బొమ్మ కదా!” మరొకరు – “ప్రతి సంవత్సరం ఈ రీతువేనా! దేవుడికి ధన్యవాదాలు, రీల్‌లో మాత్రమే చూశా, రియల్‌గా కాకుండా! నిజంగా భయపెట్టావ్ అమ్మాయి!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
భారత నగరాల్లో హాలోవీన్ ట్రెండ్
ఇటీవలి కాలంలో హాలోవీన్ వేడుకలు భారత నగరాల్లో విపరీతంగా పాపులర్ అయ్యాయి. పార్టీలు, కాస్ట్యూమ్ కాంటెస్టులు, హారర్ థీమ్ మేకప్‌లు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే, ఢిల్లీలో ఈ అన్నాబెల్ యాక్ట్ మాత్రం నిజమైన సినిమా సన్నివేశంలా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.
