Anvesh Controversy: పరువు మొత్తం పోగొట్టకున్న నా అన్వేష్
ANVESH-CONTRAVARSY
ఎంటర్‌టైన్‌మెంట్

Anvesh Controversy: పరువు మొత్తం పోగొట్టకున్న యూట్యూబర్ అన్వేష్.. ఏం అన్నాడంటే?

Anvesh Controversy: తెలుగు ట్రావెలింగ్ యూట్యూబర్ అన్వేష్ మరో సరి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే ఏయ్ జూడ్ పై పలు చాలెంజులు చేసి వాటిని సమర్థించుకోలేక తెగ తర్జన బర్జన పడుతున్నాడు. 2022లో వెనిజలాలో 14 ఏళ్ల అమ్మాయితో చేసిన వీడియోను పట్టకుని తెలుగు వారు అంతా కలిసి తన పరువు మొత్తం తీసేశారంటూ ఆవేదన చెందుతున్నాడు. అంతే కాకుండా తన ఫాలోవర్ల గురించి కూడా చెప్పుకొచ్చారు. తెలుగు వారు అందరూ కలిపి తనను చేయాల్సింది చేశారని వారందరికీ శత కోటి దండాలని, పోయిన వారు ఎలాగూ పోయారని మండిపడ్డాడు. ఇదిలా ఉండగా ఇంకా తన్ దగ్గర దాదాపు సోషల్ మీడియాలు అన్నీ కలిసి దాదాపు 70 లక్షల మంది ఉన్నారని వారు తనకు కోట్లు తెచ్చిపెగడతారంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే అన్వేష్ వేనిజులాలో 14 ఏళ్ల అమ్మాయికి మధ్య ఏదో జరిగింది అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

Read also-The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

ఇప్పటికే ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ చుట్టూ ముసురుకున్న వివాదాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో యూట్యూబ్ క్రియేటర్ ‘యే జూడ్’ అన్వేష్ వ్యవహారశైలిని తప్పుబడుతూ సాక్ష్యాలతో కూడిన ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు, అతని గత ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్వేష్ సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరించారని జూడ్ ఆరోపించారు. ముఖ్యంగా చెప్పులు ధరించి శివలింగాన్ని తాకడం, దానిని వ్యూస్ కోసం వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతమ్మ తల్లి హిందూ దేవుళ్లపై అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈ వీడియోలో తీవ్రంగా ఖండించారు.

Read also-Vidyut Jammwal: నగ్నంగా చెట్టు ఎక్కిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్.. నెటిజన్లు ఏం చేశారంటే?

ఈ వీడియోలో అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం అన్వేష్‌కు సంబంధించిన ఆడియో లీక్స్. ఒక 14 ఏళ్ల మైనర్ బాలికను రూమ్‌లోకి తీసుకెళ్లడం గురించి అన్వేష్ మాట్లాడినట్లు ఉన్న క్లిప్పింగ్స్‌ను ఇందులో ప్రస్తావించారు. ఇది చట్టరీత్యా చాలా తీవ్రమైన నేరమని, దీనిపై పోక్సో (POCSO) చట్టం కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జూడ్ అభిప్రాయపడ్డారు. తోటి యూట్యూబ్ క్రియేటర్లను వారి కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లులను ఉద్దేశించి అన్వేష్ చేసిన బూతులు అసభ్య పదజాలాన్ని జూడ్ బయటపెట్టారు. లాజికల్‌గా సమాధానం చెప్పలేక వ్యక్తిగత దాడులకు దిగడం అన్వేష్ నైజమని విమర్శించారు. దీనికి అన్వేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Just In

01

Suspicious Death: కుళ్లిన స్థితిలో మృతదేహం.. అటవీ ప్రాంతంలో షాకింగ్ ఘటన

Travel Advice: సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా!.. పోలీసులు చెప్పిన ఈ సూచనలు పాటించారా లేదా మరి?

Nari Nari Naduma Murari Trailer: ఒక హీరో, రెండు లవ్ స్టోరీస్.. పరిష్కారం లేని సమస్య!

Masood Azhar: వేలాది సూసైడ్ బాంబర్లు రెడీ.. ఉగ్ర సంస్థ జైషే చీఫ్ మసూద్ సంచలన ఆడియో లీక్!

Gadwal District: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ఉత్కంఠ.. అందరి చూపు అటువైపే..?