Gadwal District: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఓవైపు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని గద్వాల, ఐజ, ఆలంపూర్, వడ్డేపల్లి చైర్మన్ పీఠంతో పాటు వార్డ్ కౌన్సిలర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలతో పాటు ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఏ వార్డులో ఎలాంటి రిజర్వేషన్ వస్తుందో అనే దానిపై జోరుగా సాగుతోంది. నేడు ఓటర్ల తుది జాబితా ప్రకటించాక రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. పాత రిజర్వేషన్ కొనసాగిస్తారా లేక రొటేషన్ విధానం అమలు చేస్తారా అన్నది త్వరలోనే తేలనుంది.
మున్సిపల్ యూనిట్ గా రిజర్వేషన్
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానంగా వార్డులతో కూడిన ఓటర్ల ముసాయిదాను నేడు ప్రకటించనున్నారు. ఈ జాబితా ఆధారంగానే దమాషా ప్రకారం సామాజిక వర్గాల వారిగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. చైర్మన్ పీఠాన్ని రాష్ట్రం యూనిటు గా ఖరారు చేయనుండగా వార్డు కౌన్సిలర్ స్థానాలను మున్సిపల్ యూనిట్ గానే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కలిపి 50% స్థానాలను ఖరారు చేయనుండగా మిగతా 50 శాతం వార్డులను మహిళలకు రిజర్వు చేయనున్నారు. గతంలోని రిజర్వేషన్లను కాకుండా రొటేషన్ విధానంలో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ ఏ వార్డులు ఎవరికి ఖరారు అవుతాయనే దానిపై రాజకీయ పార్టీలతో పాటు ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించే మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఓటరు జాబితా ప్రకటించాకే దానిపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
గత ఎన్నికల్లో ఇలా
గద్వాల మున్సిపల్ పరిధిలో 37 వార్డులు ఉన్నాయి. 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ పీఠాన్ని జనరల్ కేటగిరికి రిజర్వేషన్ చేశారు. ప్రస్తుతం రొటేషన్ విధానం అమలు చేయనుం డంతో ఈసారి ఏ కేటగిరి కి రిజర్వ్ అవుతుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. జనరల్ మహిళ లేదంటే బిసిలకు రిజర్వు కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే వార్డులు సైతం జనాభా దమాషా ప్రకారం రిజర్వు చేయనున్నారు ఈ క్రమంలో మెజార్టీ వార్డుల్లో రిజర్వేషన్లు మారనునట్లుగా చర్చ నడుస్తోంది. అందులో పాత కౌన్సిలర్లకు ఎంతమందికి కలిసి వస్తుందనే దానిపై ఎవరికి వారుగా లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం అధికారులు ప్రకటించిన ఓటర్ జాబితాలోని మెజార్టీ ఓటర్లు గతంలో వచ్చిన రిజర్వేషన్లను పరిశీలిస్తూ అంచనా వేస్తున్నారు. అయితే ఈ సి మార్గదర్శకాలకు అనుగుణంగానే రిజర్వేషన్లు కేటాయిస్తామని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. వీటిపై సంక్రాంతి తర్వాతే స్పష్టత రానందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
రిజర్వేషన్ల పైన ఆసక్తి
మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పైన ఆశావాహులు దృష్టి సారిస్తున్నారు చైర్మన్ స్థానంతో పాటు ఆయా వార్డులో కౌన్సిలర్ కు పోటీ చేయాలనుకున్నవారు రిజర్వేషన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గత రెండు విడతల్లో ఒకే రిజర్వేషన్ ఉండాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది కానీ ప్రస్తుత ప్రభుత్వం దానిని మార్చి కొత్త రిజర్వేషన్లు అమలు చేయన్నట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ వార్డుల్లో రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది దీంతో ఆశావాహులు చైర్మన్ సీట్ ఎవరికి వస్తుందోనని అంచనాలు వేస్తున్నారు.
మున్సిపాలిటీల వారీగా ఓటర్ల జాబితా
మున్సిపాలిటీ. వార్డులు. ఓటర్లు
గద్వాల. 37. 65,370
ఐజ. 20 23,023
వడ్డేపల్లి 10. 10,604
అలంపూర్ 10. 9,622
Also Read: ND vs NZ 1st ODI: న్యూజిలాండ్తో తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

