Samsung Phones 2026: 2026లో Samsung మరోసారి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు సిద్దమవుతోంది. Galaxy S-సిరీస్, Z Fold/Flip ఫోల్డబుల్స్, A-సిరీస్, M-సిరీస్‌లలో కొత్త మోడళ్లను కంపెనీ తీసుకురానుంది. ఈ లిస్టులో 2026లో లాంచ్ అయ్యే టాప్ 10 Samsung ఫోన్లు, వాటి అంచనా ధరలు, కీలక ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
Samsung Galaxy S26 Ultra 5G
Samsung Galaxy S26 Ultra 2026లో పెద్ద అట్రాక్షన్ గా నిలవనుంది. 144Hz Dynamic AMOLED 2X డిస్ప్లే, next-gen ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్, క్వాడ్-కెమెరా సిస్టమ్, మెరుగైన S-Pen సపోర్ట్ ఈ ఫోన్ లో ప్రధాన హైలైట్స్. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.1,05,000 నుంచి 1,25,000 మధ్య ఉండొచ్చు.
Samsung Galaxy S26+ 5G
Galaxy S26+ ప్రీమియం డిజైన్‌తో, హై రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లేతో రానుంది. 2026లో విడుదల అయ్యే ఈ మోడల్ ధర రూ.85,000 నుంచి 95,000 మధ్య ఉండవచ్చని అంచనా.
Samsung Galaxy S26 5G
ఈ సిరీస్‌లో కాంపాక్ట్, లైట్ వెయిట్ వేరియంట్ S26 ఉంటుంది. AMOLED స్క్రీన్, మెరుగైన కెమెరా పనితీరు, అప్‌డేటెడ్ OneUI ప్రత్యేకతలు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.70,000 నుంచి 78,000 మధ్య ఉండొచ్చు.
Also Read: Suryapet News: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు రాళ్లతో దాడులు ఓ కార్యకర్త మృతి!
Samsung Galaxy Z Fold 8
Fold 8లో మల్టీ-టాస్కింగ్ ఫీచర్లు ఇంకా బలోపేతం అవుతాయని అంచనా. ఇన్ సైడ్ ఫోల్డబుల్ డిస్ప్లే మరింత స్ట్రాంగ్‌గా, అవుటర్ డిస్ప్లే మరింత యూజ్‌ఫుల్‌గా ఉండే అవకాశం. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.1,50,000 పైనే ఉండనుంది.
Samsung Galaxy Z Flip 8
Z Flip 8 స్టైలిష్ ఫ్లిప్ డిజైన్‌తో Mid 2026లో రానుంది. పెద్ద కవర్ డిస్ప్లే, మెరుగైన హింజ్, ఇతర కలర్ ఆప్షన్లు అందుబాటులోకి రావచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.95,000 నుంచి 1,10,000 మధ్య ఉండే అవకాశం.
Samsung Galaxy A86 5G
A86 2026లో Samsung A-సిరీస్‌లోని టాప్ మిడ్-రేంజ్ మోడల్. హై-రెసల్యూషన్ కెమెరా, AMOLED డిస్ప్లే, ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ యొక్క ప్రధాన ఫీచర్లు. ఈ స్మార్ట్ ఫోన్ అంచనా ధర రూ.32,000 నుంచి 38,000 మధ్య ఉండొచ్చు.
Samsung Galaxy A76 5G
A76 మిడ్ రేంజ్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంటుంది. గేమింగ్‌కు సరిపడే ప్రాసెసర్, మంచి డేలైట్ కెమెరా, AMOLED FHD+ స్క్రీన్ వీటి ముఖ్య హైలైట్స్. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.25,000 నుంచి 32,000 మధ్య ఉండవచ్చు.
Samsung Galaxy A36 5G
A36 సరసమైన ధరలో బ్యాలెన్స్డ్ పనితీరును అందిస్తుంది. మంచి బ్యాటరీ బ్యాకప్, 5G సపోర్ట్, లైట్‌వెయిట్ బాడీ ఈ ఫోన్ యొక్క ఆకర్షణలగా ఉండనున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.18,000 నుంచి 24,000 మధ్య ఉండవచ్చు.
Samsung Galaxy M66 5G
M66 పెద్ద బ్యాటరీతో లాంగ్ యూజ్‌జ్ కోసం రూపొందించబడింది. పెద్ద డిస్ప్లే, డైలీ యూజ్‌కు సరిపడే ప్రాసెసర్, 5G సపోర్ట్ లభ్యం. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.16,000 నుంచి 22,000 మధ్య ఉండవచ్చు.
Samsung Galaxy F66 5G
F66 2026లో Samsung F-సిరీస్‌లో ముఖ్య మోడల్. బ్యాటరీ, పనితీరు ఆప్టిమైజేషన్, సింపుల్ కానీ ప్రాక్టికల్ కెమెరా సెటప్ ప్రధాన హైలైట్స్. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,000 నుంచి 20,000 మధ్య ఉండవచ్చు.

