ౌTelangana Jagruthi: ఖబడ్దార్ మాధవరం కృష్ణారావు
Telangana Jagruthi ( image CREDIT: SWETCHA REPORTER)
Telangana News

Telangana Jagruthi: ఖబడ్దార్ మాధవరం కృష్ణారావు.. ఎక్కువ మాట్లాడితే నీ చిట్టా విప్పుతాం.. జాగృతి నాయకుల హెచ్చరిక

Telangana Jagruthi: మాధవరం కృష్ణారావు నువ్వు మనిషివైతే వెంటనే ఎమ్మెల్సీ కవితకు బేషరత్తుగా క్షమాపణ చెప్పి నీ పదజాలాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) నాయకులు హెచ్చరించారు. కవిత సొంత అభిప్రాయం గానీ.. వ్యక్తిగతంగా కానీ ఎవరినీ ఏమీ అనలేదన్నారు. కూకట్ పల్లిలో 15 ఏళ్లుగా మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యేగా ఉన్నారని కానీ కూకట్ పల్లి లో ప్రజల పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఖబడ్దార్ మాధవరం కృష్ణారావు.. ఎక్కువ మాట్లాడితే నీ చిట్టా విప్పుతామని హెచ్చరించారు.

ప్రజల ముందు పెట్టి నీ బాగోతాన్ని బయటపెట్టడతాం

నువ్వు చేసిన భూకబ్జాలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అన్నింటిని ప్రజల ముందు పెట్టి నీ బాగోతాన్ని బయటపెట్టడతామన్నారు. కూకట్ పల్లి పర్యటనలో ప్రజలు చెప్పిన సమస్యలనే కవిత చెప్పారు. ప్రభుత్వ స్థలాన్ని మీరు ప్రైవేట్ సంస్థలకు అది కూడా మీకు సంబంధించిన వ్యక్తులకు లీజు కు ఇచ్చారు.. అది నిజమా కాదా అన్నది చెప్పాల్సిన అవసరముందా? లేదా? కవితఅడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నోటికి వచ్చినట్లు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.

Also Read: Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

చెరువులు ఎటు పోయినయ్ వాటిని ఎవరు మింగేశారు?

హైదరాబాద్ ను కాపాడుతున్నామని కృష్ణారావు అంటున్నారని, మరి హైదరాబాద్ లో చెరువులు ఎటు పోయినయ్.. వాటిని ఎవరు మింగేశారు? పేదల ఇళ్లను కూల్చుతున్న హైడ్రా… పెద్దల జోలికి ఎందుకు వెళ్లటం లేదని ప్రజలు అడుగుతున్నారు. పొద్దునే ప్రెస్ మీట్ పెట్టడంటేనే మనిషి తేడాగా ఉన్నాడని డౌట్ వచ్చింది.. ఆయన మాట్లాడే బాష ప్రజాప్రతినిధి మాట్లాడే బాష కానే కాదన్నారు. సమావేశంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Telangana Jagruthi Medak: బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత సంచలన కామెంట్స్

బీఆర్ఎస్ పై కవిత ఫైర్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ట్విట్ మరోసారి హాట్ టాపిక్ అయింది. రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చజరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తు ట్విట్ చేయడం చర్చకు దారితీసింది. అధికారం కోల్పోయాక దీక్షా దివస్ లు.. విజయ్ దివస్ లు.. ఇది ఉద్యమాలగడ్డ ప్రజలు అన్నీ గమనిస్తున్నరు!! అని మంగళవారం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇప్పటికే ఒక వైపు బీఆర్ఎస్ పార్టీని, మరోవైపు ఆపార్టీ నేతలను టార్గెట్ చేస్తు ఆమె విమర్శలు గుప్పిస్తున్నది.

బీఆర్ఎస్ నాయకత్వ వైఫల్యం

ఇంకో వైపు తనను పార్టీ నుంచి అకారణంగా సస్పెండ్ చేశారని మండిపడుతుంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఏక వాక్యంతో తన మనసులో మాటను బయట పెట్టారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని, ఫలితం అనుభవించాల్సిందేనని కవిత పరోక్షంగా బీఆర్ఎస్ నాయకత్వ వైఫల్యమని పేర్కొంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని కవిత కారు పార్టీ నాయకత్వానికి శాపనార్థాలు పెట్టింది.

Just In

01

Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది.. చూశారా మరి..

Akhil Vishwanath: కేరళ స్టేట్ అవార్డు నటుడు అఖిల్ విశ్వనాథ్ కన్నుమూత.. 30 ఏళ్లకే..

Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!

Messi Mania: ఉప్పల్‌లో మెస్సీ మేనియా.. ఉర్రూతలూగుతున్న స్టేడియం