Telangana Jagruthi Medak: కేంద్రప్రభుత్వం బీసీ బిల్లు పార్లమెంట్ లో పెట్టీ 42 శాతం రిజర్వేషన్లు కలిపించేంతవరకు జాగృతి, పూలే యునైటెడ్ ఫ్రంట్, బీసీ సంఘాలు ఐక్యంగా కేంద్రపాలకులు స్పందించే వరకు ఉద్యమాలు నిర్వహిస్తామని అందులో భాగంగా జూలై 17 న రాష్ట్రవ్యాప్తంగా రైలు రోకో నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించినట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల బీసీ సంఘాలు, జాగృతి, పూలే యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై మాట్లాడారు. బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని కవిత ఆరోపించారు.
బిల్లు ఆమోదం తరువాతే ఎన్నికలు
బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి తెలంగాణ ఉద్యమ సమయంలో వంటా వార్పు, రైలు రోకో తదితర ఉద్యమాలు నిర్వహించిన మాదిరిగా బీసీ కులాలను అన్నింటిని కలుపుకొని జాగృతి పూలే యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి బిసీ లను జాగృత పరుస్తామని చెప్పారు. కేంద్రంలో బీసీ బిల్లు ఆమోదం పొందిన తరువాతనే ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని లేకుంటే జరగనివ్వనని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీసీ విద్యార్థులు, మహిళలు, ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కలిసి రావాలని కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు. తెలంగాణ జాగృతి, పూలే యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఒత్తిడి తోనే అసెంబ్లీలో మూడు బీసీ బిల్లులు పెట్టిందన్నారు. వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు కానీ అనేక కులాలు బీసీల్లో ఉన్నాయని అన్నారు. అసెంబ్లీ గడప తొక్కని అనేక కులాలు ఉన్నాయని అన్నారు. రాజకీయ అవకాశాల్లో బీసీ మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లో బిసి కోటా ఉండాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీ రౌండ్ టేబుల్ సమావేశం రాజకీయ వేదిక కాదని ఇది మానవ హక్కుల వేదిక అని కవిత అభివర్ణించారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సాక్ష్యం ఇవ్వటానికి రానున్న పీసీసీ ఛీఫ్
రఘునందందన్ రావును బీసీ బిల్లు కోసం ప్రశ్నించండి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ను ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని కవిత కోరారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీసీ బిల్లు కోసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఒక్కరోజు ఆయన పార్లమెంట్ లో అడుగలేదని నిప్పులు చెరిగారు.కులగణన వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీల వారిగా ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ బి.శంకర్,సంపత్ గౌడ్, కూచన్ పల్లి రామకృష్ణగౌడ్,స్వామి,వీరన్న,చాకలి స్వామి,తదితరులు మాట్లాడారు. ఈ సమావేశానికి మెదక్,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల బీసీ నాయకులు,జాగృతి, పూలే యునైటెడ్ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కవితను కలవని బిఆర్ఎస్ నేతలు..హాజరుకాని బీసీ నేతలు
మెదక్ ఉమ్మడి జిల్లా లోని బి ఆర్ ఎస్ పార్టీ నేతలు కానీ, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్య రావ్ సహా మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్, బీసీ నేతలు కానీ ఎవ్వరు కవిత పెట్టిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనలేదు. కనీసం ఆ పార్టీ బీసీ నేతలు సహితం హాజరు కాలేదు. కవిత వల్ల గతంలో పదవులు పొందిన నేతలు సహితం దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Kuppam Incident: సీఎం ఇలాకాలో దారుణం.. మహిళను చెట్టుకు కట్టేసి చిత్ర హింసలు