Kuppam Incident: ఆంధ్రప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. కుప్పం మున్సిపాలిటీ (Kuppam Muncipality) పరిధిలోని నారాయణ పురం (Narayanapuram)లో ఈ దారుణం చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదన్న కారణంగా మహిళను తీవ్రంగా హింసించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు సైతం స్పందించారు.
వివరాల్లోకి వెళ్తే..
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప (Timmarayappa), శిరీష (Sireesha) భార్య భర్తలు. గ్రామానికి చెందిన మునికృష్ణప్ప (Muni Krishnappa) దగ్గర భర్త తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుభారం పెరిగిపోవడంతో భార్య, బిడ్డలను వదిలేసి తిమ్మరాయప్ప ఊరు విడిచి వెళ్లిపోయాడు. దీంతో భార్య సైతం పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.
Shocking ! In CM #ChandrababuNaidu's own constituency Kuppam an alleged #TDP worker tied a 25-year-old woman to a tree and publicly humiliated her over an unpaid loan of ₹80,000. Victim Sirisha has been raising her two children on her own since her husband abandoned them. After… pic.twitter.com/UI0Xft63Lh
— Ashish (@KP_Aashish) June 17, 2025
భార్యను చెట్టుకు కట్టేసి
అయితే పిల్లాడి స్టడీ సర్టిఫికేట్ కోసం శిరీష.. తిరిగి గ్రామానికి వచ్చింది. అయితే అప్పు తీర్చకుండా వెళ్లిపోయారని తీవ్ర ఆగ్రహంతో ఉన్న మునికృష్ణప్ప, అతని కుటుంబం.. శిరీషను చూడగానే ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆమెపై దాడి చేయడమే కాకుండా తాడుతో చెట్టుకు కట్టేశారు. అప్పుతీర్చాలంటూ గంటపాటు వేధింపులకు గురిచేశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శిరీషను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మునికృష్ణప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Baba Vanga Prediction: ముంచుకొస్తున్న ముప్పు.. ఆ రోజున ఏం జరగబోతోంది.. నెట్టింట ఒకటే చర్చ!
సీఎం చంద్రబాబు ఆగ్రహం
తన నియోజక వర్గంలో జరిగిన దారుణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే నిందితుడు మునికృష్ణప్పను అరెస్ట్ చేసినట్లు సీఎంకు ఎస్పీ తెలిపారు. మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని జిల్లా అధికారులకు సీఎం సూచించారు.