BCCI Searching For New Coach
స్పోర్ట్స్

Team India Coach: కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట

BCCI Searching For New Coach: టీమిండియా కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. విదేశీ ఆటగాళ్లు ఏఏ జట్లకు కోచ్‌గా ఉన్నారు.? వారి పెర్ఫార్మెన్స్‌పై ఆరా తీస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలో చాలామంది ఆటగాళ్లతో సమావేశమవుతోంది. టీమిండియా కోచ్‌గా ఉండేందుకు చాలామంది ఇంట్రెస్ట్‌ చూపుతున్నారు. కొంతమంది మొగ్గుచూపడం లేదు.

ఏడాదిలో పది నెలల జట్టుతో గడపాల్సి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కోచ్ రాహుల్ ద్రావిడ్ తప్పుకోవడానికి ఓ కారణం. తాజాగా ఓ కొత్త న్యూస్ బయటకు వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీపాంటింగ్‌ను బీసీసీఐ సంప్రదించినట్టు తెలుస్తోంది.ఈనెల మొదటివారం ఢిల్లీలో రికీపాంటింగ్‌తో బీసీసీఐ సెక్రటరీ జై షా, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ సమావేశమయ్యారు. టీమిండియాకు కోచ్‌గా రావాలని రిక్వెస్ట్ చేశారట. వారి అభ్యర్థనను సున్నితంగా ఆయన తిరస్కరించినట్టు టాక్‌. టీమిండియా కోచ్‌గా ఉండాలంటే దాదాపు 10నెలలు పాటు ఆటగాళ్లతో ఉండాల్సి వస్తుందని అన్నాడు. ఈ విషయంలో ఫ్యామిలీకి దూరంగా ఉండలేనని రికీ చెప్పినట్టు తెలుస్తోంది.

Also Read:నిష్క్రమించిన బెంగళూరు జట్టు..!

ఈ క్రమంలో కోచ్ పదవిని తిరస్కరించినట్టు రికీపాంటింగ్ చెప్పుకొచ్చాడు.రికీ పాంటింగ్ ఆట గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఆసీస్‌కు కెప్టెన్‌గా చాలా విజయాలను అందించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. అంతకుముందు ముంబై జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు కూడా. కోచ్ పదవికి అప్లైకి కేవలం నాలుగురోజులు మాత్రమే గడువు ఉంది. ఈ క్రమంలో చెన్నై కోచ్ ఫ్లెమింగ్‌, రాజస్థాన్ కోచ్ కుమార సంగక్కర‌, లక్నో కోచ్ జస్టిన్ లాంగర్, కోల్‌కతా టీమ్ మెంటార్ గంభీర్ వంటి మాజీలు పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి చివరకు ఎవరిని బీసీసీఐ ఎంపిక చేస్తుందో చూడాలి.

Just In

01

Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే

Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో 2 లక్షల 32 వేల 520 విగ్రహాలు నిమజ్జనం.. జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడి

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు