Departed Bangalore team In IPL 2024:వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ కీలక పోరులో పుంజుకుంది. ఎలిమినేటర్‌లో విజయంతో ఆ జట్టు క్వాలిఫయర్2కు చేరుకోగా, ఓటమితో బెంగళూరు టోర్నీ నుంచి నిష్ర్కమించింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 172/8 స్కోరు చేసింది. రజత్ పటిదార్, కోహ్లీ, లోమ్రోర్ రాణించారు.
అవేశ్ ఖాన్, అశ్విన్ బంతితో రెచ్చిపోయి ఆర్‌సీబీని మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్, హెట్మేయర్ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. శుక్రవారం జరిగే క్వాలిఫయర్2లో ఫైనల్ బెర్త్ కోసం హైదరాబాద్‌తో తలపడనుంది. 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే ఆర్‌సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ ఛేదన మరీ సాఫీగా ఏం సాగలేదు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రాణించడంతో ఛేదనలో జట్టుకు శుభారంభం దక్కింది.
Also Read:ఆటకి వీడ్కోలు పలికిన దినేష్ కార్తీక్
యశ్ దయాల్ వేసిన మూడో ఓవర్‌లో నాలుగు ఫోర్లు కొట్టి దూకుడు మొదలుపెట్టిన అతను..మిగతా బౌలర్లపై కూడా ఎదురుదాడికి దిగాడు. అయితే మరో ఎండ్‌లో అతనిలా దూకుడుగా ఆడే వారు కరువయ్యారు. మరో ఓపెనర్ కోహ్లెర్ కాడ్‌మోర్, కెప్టెన్ శాంసన్ నిరాశపర్చినా వారితో కలిసి జైశ్వాల్ జట్టును మెరుగైన స్థితిలో నిలబెట్టాడు. అయితే హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న జైశ్వాల్(45)ను గ్రీన్ అవుట్ చేయడంతో అతని దూకుడుకు బ్రేక్ పడింది. స్వల్ప వ్యవధిలోనే జైశ్వాల్, శాంసన్ వికెట్లతోపాటు ధ్రువ్ జురెల్(8) వికెట్ నష్టపోవడంతో రాజస్థాన్ తడబడింది.