Kavitha Hunger Strike: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ దగ్గర బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేస్తామని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) ప్రకటించారు. దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జాగృతి నాయకులు సెంట్రల్ జోన్ పోలీసులకు దరఖాస్తు అందజేశారు. అయితే, అనుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: BJP Telangana: కాసేపట్లో బీజేపీ మహాధర్నా.. ధర్నాచౌక్ వేదికగా నిరసన.. ఎందుకంటే?
72 గంటల నిరాహార దీక్ష
తెలంగాణ జాగృతి(Telangana Jagruti)నాయకులు 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని మండిపడ్డారు. హైకోర్టు(High Court)ను ఆశ్రయించి దీక్షకు అనుమతి కోరనున్నట్లు ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అడ్డుకున్నా ఎన్ని ఆటంకాలు సృష్టించినా 72 గంటల నిరాహార దీక్ష చేస్తానని తేల్చిచెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 7వ తేదీన ఉదయం 10 గంటల వరకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని కవిత వెల్లడించారు. దీక్షకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు ఏవేవో సాకులు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Bc reservation bill: కాంగ్రెస్ ప్లాన్‌తో ఇరకాటం.. బిల్లు ఆర్డినెన్స్ పెండింగ్