Kamal Haasan: యూనివర్సల్ హీరో, విలక్షణ నటుడు కమల్ హాసన్ తన పుట్టినరోజు (HBD Kamal Haasan) సందర్భంగా సినీ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పతాకంపై రూపొందనున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ #KHAA ను ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు, ఈ ప్రాజెక్ట్‌కు పనిచేయబోతున్న టాలెంటెడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బరివ్ (అన్బు మణి, అరివు మణి) దర్శకులుగా అరంగేట్రం చేస్తున్నారని ప్రకటించడంతో.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #KHAA చిత్రానికి పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్ ‘హంట్ మోడ్ ఆన్’ అని రివీల్ చేశారు. ఈ సినిమా ఒక పక్కా యాక్షన్ స్పెక్టకిల్‌గా రూపుదిద్దుకోబోతోందని స్పష్టం చేస్తోంది. కమల్ హాసన్‌కు మాత్రమే సరిపోయే ఐకానిక్ స్థాయి యాక్షన్ అంశాలు ఇందులో పుష్కలంగా ఉండబోతున్నాయని మేకర్స్ సంకేతాలు ఇచ్చారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, RKFI పతాకంపై వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం కానుంది.
Also Read- IFFI 2025: ‘సంక్రాంతికి వస్తున్నాం’కు అంతర్జాతీయ గౌరవం.. ఇండియన్ పనోరమాకు ఎంపిక
స్టంట్ కొరియోగ్రాఫర్ల నుంచి దర్శకులుగా..
‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలో తమ అద్భుతమైన స్టంట్ కొరియోగ్రఫీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్బరివ్ (Anbariv), ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు. వారి యాక్షన్ విజన్, కమల్ హాసన్ అనుభవం కలగలిస్తే, ఈ సినిమా యాక్షన్ జానర్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ద్వారా కమల్ హాసన్, ఈ ప్రతిభావంతులైన యాక్షన్ మాస్టర్స్‌కు తమ క్రియేటివ్ విజన్‌ను పూర్తి స్థాయిలో చూపించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల బృందం పనిచేయనుంది. సునీల్ కె.ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, యువ సంగీత దర్శకుడు జేక్స్ బీజోయ్ సంగీతాన్ని అందించనున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను షమీర్ కె.ఎం, ప్రొడక్షన్ డిజైన్‌ను వినేష్ బంగ్లాన్ పర్యవేక్షించనున్నారు. ఈ టెక్నికల్ టీమ్, సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Also Read- Bigg Boss Telugu 9: వార్ ఫర్ పవర్.. మరోసారి టార్గెట్ తనూజ.. హౌస్ సపోర్ట్ ఎవరికి?
తలైవర్173 చిత్రానికి నిర్మాతగా..
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అండదండలతో దర్శకులుగా మారిన అన్బరివ్, #KHAA తో ప్రేక్షకులకు ఎలాంటి యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్నారో చూడాలి! ఈ చిత్రంపై సినీ వర్గాల్లో, అభిమానుల్లో అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరాయి. మరో వైపు సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth)తో రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ ఓ సినిమాను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. #Thalaivar173గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సుందర్ సి దర్శకుడు. 2027 పొంగల్‌కు ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నారు. ఇద్దరు మహానటుల మధ్య ఐదు దశాబ్దాల స్నేహం, సహోదర బంధాన్ని సెలబ్రేట్ చేసుకునే బిగ్ సినిమాటిక్ ఈవెంట్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు కిక్ ఇవ్వనుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
