IFFI 2025: టాలీవుడ్‌లో ప్రాంతీయ చిత్రాల స్థాయిని మరింతగా పెంచిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam). ఈ సినిమాకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2025లో, ప్రతిష్ఠాత్మకమైన ‘ఇండియన్ పనోరమా’ (ఫీచర్ ఫిల్మ్స్) విభాగంలో ఈ సినిమా అధికారికంగా ఎంపికైంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమకు మరింత కీర్తిని తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అంశాలు కలగలిసిన ఈ చిత్రం, ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ అయిన వై.డి. రాజు (వెంకటేష్) జీవితాన్ని, అతడు ఒక రహస్య ప్రభుత్వ రెస్క్యూ మిషన్ మేనేజ్ చేయడంతో పాటు, తన కుటుంబ బాధ్యతలను ఎలా సమన్వయం చేసుకుంటాడనే ఆసక్తికరమైన కథాంశంతో వచ్చి.. ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి, భారీగా కలెక్షన్స్‌ను రాబట్టి, బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది.
Also Read- Bigg Boss Telugu 9: వార్ ఫర్ పవర్.. మరోసారి టార్గెట్ తనూజ.. హౌస్ సపోర్ట్ ఎవరికి?
గ్రాండ్ సక్సెస్‌కు కారణమిదే..
ఈ సినిమాలో వెంకటేష్ విక్టరీ (Victory Venkatesh) ప్రధాన పాత్ర పోషించగా, ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కీలక పాత్రల్లో నటించారు. శిరీష్ నిర్మాణంలో, దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. కెమెరామెన్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు పనిచేశారు. నరేష్, సాయి కుమార్, విటివి గణేష్ వంటి ప్రముఖ నటులు సహాయ పాత్రల్లో.. తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వీరంతా ఒక ఎత్తయితే.. బుడతడు బుల్లిరాజు చేసిన కామెడీ ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేసింది. బుల్లిరాజుకు ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ వస్తున్నాయంటే.. అతని పాత్ర ఈ సినిమా సక్సెస్‌లో ఎంత వరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Allu Arjun: జక్కన్న, నీల్, వంగా.. బన్నీ లైనప్ చూస్తుంటే మెంటలొచ్చేస్తుంది! ఇక తగ్గే దే లే..
ప్రాంతీయ సినిమాకు లభించిన గుర్తింపు
గోవాలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో (IFFI 2025).. ప్రపంచంలోని ఉత్తమ చిత్రాల మధ్య ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రదర్శితం కానుంది. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తాను చాటడానికి, ఇతర భారతీయ సినిమాలతో కలిసి నిలవడానికి ఈ ఇండియన్ పనోరమా ఎంపిక ఒక గొప్ప అవకాశం. అనిల్ రావిపూడి టేకింగ్, కథనం, ప్రధాన నటుల అద్భుత ప్రదర్శన ఈ సినిమాను ప్రాంతీయ చిత్రాల ప్రమాణాలలో ఒక మైలురాయిగా నిలబెట్టాయి. ఈ అంతర్జాతీయ వేదికపై ఈ చిత్రం మరింత మంది సినీ ప్రియుల మన్ననలు పొందుతుందని, తెలుగు సినిమాకు మరిన్ని అవార్డులు దక్కేలా చేస్తుందని అంతా ఆశిస్తున్నారు. ఇది తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని చెప్పుకోవచ్చు.
#SankranthikiVasthunam has been officially selected for the Indian Panorama (Feature Films) at the International Film Festival of India (IFFI) 2025 ❤️🔥❤️🔥❤️🔥
Another remarkable milestone for a film that set a new benchmark for regional films in TFI 💥
An @AnilRavipudi film 🔥… pic.twitter.com/eMP57q7Zw9
— Sri Venkateswara Creations (@SVC_official) November 7, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
