Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 61వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 61) ఆసక్తికర టాస్క్ జరిగింది. హౌస్‌లో రెండు రైళ్లను ఏర్పాటు చేసిన బిగ్ బాస్.. హౌస్‌మేట్స్‌తో ఓ ఆట ఆడుకున్నాడు. ప్రస్తుతం హౌస్ కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. కెప్టెన్సీ కోసం అందరూ పోటీ పడుతున్నారు. ‘వే టు కెప్టెన్సీ’ అనే ఈ టాస్క్‌లో మొదటి బెల్ మోగగానే అక్కడున్న రెండు ట్రైన్‌లో ఒకదానికి డ్రైవర్ అవ్వాల్సి ఉంటుంది. తన ట్రైన్‌లో ఉన్న కంటెండర్స్‌లో ఒకరిని ఎంచుకుని, కారణాలు చెప్పి.. వారిని ఆ ట్రైన్ నుంచి దింపి కెప్టెన్సీ రేసు నుంచి తొలగించాలని బిగ్ బాస్ సూచించగా.. ఈ టాస్క్‌లో దివ్య, సాయిల మధ్య పెద్ద వారే నడిచింది. రీతూ మాట విని.. దివ్యని సాయి రేసు నుంచి దింపేశారు.
తనూజని తీసేస్తున్నా
‘ఇంటి సభ్యులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇదే ఈ ప్రక్రియలో ఆఖరి రౌండ్. కేవలం రెడ్ ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్న వారితో కలిపి, మిగిలిన అందరూ డ్రైవర్ అవడానికి ప్రయత్నించవచ్చు’ అని బిగ్ బాస్ చెప్పగానే గేమ్ మొదలైంది. ఇందులో దివ్య గెలిచినట్లుగా చూపించారు. కెప్టెన్సీ రేసులో ఉన్న రీతూ (Rithu), తనూజ (Tanuja), ఇమ్ము(Emmu)లలో ఇమ్మూకి దివ్య సపోర్ట్ అని చెప్పింది. ఈ ముగ్గురిలో ఎవరిని తీసేస్తే.. ఇమ్మానుయేల్‌కి ఒక ఫైటింగ్ ఛాన్స్ ఉంటుందో.. అనే బేసిస్ మీద ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. తనూజని తీసేస్తున్నాను అని దివ్య ప్రకటించింది. ఇమ్మూని కెప్టెన్ చేయడానికి నన్ను తీసేస్తున్నావా? అంటూ దివ్యని తనూజ ప్రశ్నించింది. అంతే.. అని దివ్య (Divya) సమాధానమిచ్చింది.
పర్సనల్ రీజన్ అని చెప్పు..
‘నీకు కొంచెమైనా అనిపిస్తుందా? పర్సనల్ రీజన్ తీసుకుని వచ్చి’ అని తనూజ అనగానే.. ‘పర్సనల్ రీజన్ ఏం తీసుకొచ్చాను?’ అని దివ్య ప్రశ్నించింది. ‘నీది, భరణి సార్‌ది. దాని వల్ల తీసేస్తున్నానని చెప్పు. నువ్వు ఆ ఛైర్‌ని అడిగినందుకు.. నువ్వు తనూజని ఎలిమినేట్ చేయవని చెప్పినందుకే ఇచ్చారు. ఇక్కడ ఇమ్మానుయేల్ కాదు, రీతూ కాదు.. కేవలం పర్సనల్ రీజన్ మాత్రమే. నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. డోంట్ టాక్ టు మీ’ అంటూ ఏడ్చుకుంటూ తనూజ హౌస్‌లోకి వెళ్లిపోయింది. మధ్యలో కళ్యాణ్ కలగజేసుకున్నా, దివ్య వివరణ ఇస్తున్నా.. తనూజ వినలేదు. ‘పర్సనల్స్ ఏవైనా ఉంటే హౌస్ బయట పెట్టుకో.. హౌస్ లోపల కాదు’ అంటూ తనూజ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి వెళుతుంది. ఇద్దరి మధ్య వాగ్వివాదం నడుస్తుంది. తర్వాత అసలైన ఫ్యామిలీ డ్రామా మొదలైంది.
Also Read- Akhanda 2: బాలయ్య పాన్ ఇండియా ప్రచారంలో దూకుడేది.. ఇంకా అనుమానాలేనా?
భరణిలో నో ఛేంజ్..
తనూజ బెడ్‌పై కూర్చుని భోరున ఏడుస్తుంది. అందరూ ఆమెను ఓదార్చుతున్నారు. ‘వాళ్లిద్దరి మధ్యలోకి నేను వెళ్లడం లేదురా’ అని రీతూకి తనూజ చెబుతుంది. ‘మీరు ఇంకెప్పుడూ నాతో మాట్లాడవద్దు’ అని భరణికి తనూజ ఏడ్చుకుంటూనే చెబుతుంది. మొత్తంగా చూస్తే.. దివ్య, తనూజ మధ్య భరణి నలిగిపోతున్నాడనేది మాత్రం ఈ ఎపిసోడ్ చూస్తుంటే క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడైనా భరణి.. వారిద్దరినీ వదిలేసి.. తన సొంత స్టాండ్ తీసుకుంటే బాగుంటుందని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. చూస్తుంటే అది జరిగేలా కనిపించడం లేదు. తనూజ ఏడుస్తుంటే.. భరణి ఫీలైపోతున్నారు. ఆ బంధాల్లో నుంచి ఆయన బయటపడే అవకాశమే లేదు అన్నట్లుగా ఈ ఎపిసోడ్ తెలియజేస్తుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
