Minister Ponguleti: బిహార్‌లోనూ తెలంగాణ తరహాలో అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) ఆ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. బుధవారం ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)తో కలిసి బిహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాల పాటు అవినీతి, అక్రమాలు, అవకాశవాద రాజకీయాల కారణంగా బిహార్ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు.
ఎన్డీఏ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది?
అధికారంలో ఉన్న ఎన్డీఏ(NDA) కూటమికి ఓటమి భయం పట్టుకుందనే అలవికాని హామీలు ఇస్తుందని విమర్శించారు. ఎన్డీఏ ఎన్నికల ప్రణాళికలో కోటి వరాలు ప్రకటించడం, యువతకు కోటి ఉద్యోగాలు, కోటి మందిని లక్‌పతి దీదీలుగా చేస్తామని హామీలు ఇవ్వడంపై ఆయన ప్రశ్నించారు. ‘అధికారంలో ఉన్న ఈ 20 సంవత్సరాలలో ఎన్డీఏ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఎంతమంది దీదీలను లక్‌పతులుగా చేసింది? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వీటిని అమలు చేయలేదు?’ అని పొంగులేటి నిలదీశారు. బిహార్ ప్రజలను కొత్త కొత్త హామీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. బిహార్ ప్రజలు ఈసారి మహాగఠ్‌బంధన్‌ను గెలిపిస్తే, తెలంగాణ మోడల్ పాలనను అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Also Read: Shiva 4K re-release: నాగార్జున చేసిన పనికి ఫిదా అయిన ఫ్యాన్స్.. ఏం చేశారంటే?
తెలంగాణలో అమలు..
తెలంగాణ(Telangana) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని ఆయన వివరించారు. రైతులకు రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణం, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి హామీలను తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. బిహార్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మహాగఠ్‌బంధన్‌కు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహాగఠ్‌బంధన్(Mahagathbandhan)ను గెలిపిస్తే యువకుడైన తేజస్వి యాదవ్(Tejaswi Yadav) ముఖ్యమంత్రి అవుతారని పొంగులేటి అన్నారు.
Also Read: Bandi Sanjay: పదో తరగతి విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభవార్త
