Bandi Sanjay: పదో తరగతి విద్యార్థులకు బండి సంజయ్ శుభవార్త
Bandi Sanjay (imagecredit:twitter)
Telangana News

Bandi Sanjay: పదో తరగతి విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభవార్త

Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుకునే విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) శుభవార్త చెప్పారు. ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు బండి సంజయ్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్(Karimnagar) పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు.

పిల్లలకు పరీక్ష ఫీజు..

వీరిలో కరీంనగర్ జిల్లాలో 4,847, సిరిసిల్ల జిల్లాలో 4059, సిద్దిపేట జిల్లాలో 1118, జగిత్యాల జిల్లాలో 1135, హన్మకొండ జిల్లాలో 1133 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ పరీక్ష ఫీజు చెల్లించాలంటే రూ.15 లక్షలకుపైగా ఖర్చవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే. వారిలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూలీ పనిచేసేవారున్నారు. పిల్లలకు పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదని తెలుసుకున్న బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని ఆయా స్కూళ్లలో చదివే విద్యార్థుల ఫీజు మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఆ మొత్తాన్ని తన వేతనం నుంచి చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపారు.

Also Read: Kartika Purnima 2025: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. ఇవాళ ఎంత స్పెషలో తెలుసా?

మోడీ కిట్స్ పేరుతో..

వాస్తవానికి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు సరస్వతి శిశు మందిరాల్లో చదువుకునే విద్యార్థులు సహా దాదాపు 20 వేల మందికి ‘మోడీ గిఫ్ట్’ పేరుతో బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేశారు. అతి త్వరలోనే సర్కారీ స్కూళ్లలో 9వ తరగతి చదువుకునే విద్యార్థులకు సైతం సైకిళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. అలాగే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే మోడీ కిట్స్ పేరుతో విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్, పెన్ను, పెన్సిళ్లు, స్టీల్ వాటర్ బాటిల్ ను పంపిణీ చేయబోతున్నారు.

Also Read: Gaddam Prasad Kumar: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ.. షెడ్యూల్ విడుదల చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?