manne krishank
Politics

BRS: బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్టు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

– పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్
– ఓయూలో నీటి కొరత అంటూ ఫేక్ ప్రచారం
– హాస్టల్ వార్డెన్ ఫిర్యాదుతో చర్యలు
– చౌటుప్పల్ దగ్గర అదుపులోకి తీసుకున్న ఖాకీలు
– 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

Manne Krishank: ఉస్మానియాలో నీటి కొరత అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఈమధ్య తెగ హడావుడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి మన్నె క్రిశాంక్‌ను చౌటుప్పల్‌లోని టోల్ గేట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో నీటి కొరత కారణంగా హాస్టల్‌కు సెలవులు ఇచ్చారని ఫేక్ న్యూస్ సృష్టించి సర్కులేట్ చేశారని వార్డెన్ ఫిర్యాదు చేశారని తెలిపారు పోలీసులు.

Also Read: కేసీఆర్‌ను తరిమేశాం! ఇక.. మోదీని దించేద్దాం!!

ఈ క్రమంలోనే క్రిశాంక్‌ను అరెస్ట్ చేసినట్టు స్పష్టం చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ దీనిపై వివరణ ఇచ్చారు. అంతకుముందు, కేటీఆర్ ప్రెస్ మీట్ కోసం కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా, పంతంగి టోల్ ప్లాజా దగ్గర తనను పోలీసులు ఆపారని, అరంగట సేపు ఎండలో నిలబెట్టారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు క్రిశాంక్. ఉన్నతాధికారులు వస్తున్నారని చెప్పి తనను అక్కడే ఉంచారని చెప్పారు.

క్రిశాంక్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. కాగా, కోర్టు మన్నె క్రిశాంక్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది.

Just In

01

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Suriya: ఒక కామన్ మ్యాన్‌, కింగ్ సైజ్‌లో కనిపించాలంటే.. రవితేజ తర్వాతే ఎవరైనా?

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?