Stray-Dog-Case (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Stray Dogs Case: వీధి కుక్కల బాధితులకు సుప్రీంకోర్టులో ఊరట.. ఇకపై ఆ షరతు ఎత్తివేత

Stray Dogs Case: వీధి కుక్కల కేసుపై (Stray Dogs Case) విచారణ చేపడుతున్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం (నవంబర్ 3) కీలకమైన నిర్ణయం తీసుకుంది. సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్న ఈ కేసులో, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండానే బాధితులు జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. కుక్క కాటుకు గురైన బాధితులు ఎవరైనా కేసులో జోక్యం చేసుకోవాలనుకుంటే గతంలో ఫీజులు చెల్లించాలనే కండీషన్ ఉండేది. వ్యక్తులు రూ.25 వేలు, వీధి కుక్కల సంరక్షణ కోసం వాదించే ఎన్‌జీఓలు రూ.2 లక్షల మేర కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తాన్ని సంబంధిత మున్సిపల్ సంస్థల ఆధ్వర్యంలో వీధి కుక్కలకు మౌలిక సదుపాయాలు, ఇతర కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి వినియోగించేవారు.

అయితే, ఇకపై ఫీజులు చెల్లించకుండానే బాధితులు కేసు విచారణలో జోక్యం చేసుకోవచ్చని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ. అంజారియాలతో కూడిన బెంచ్ సోమవారం ఆదేశాలు ఇచ్చింది. కేసులో జోక్యం చేసుకునేందుకు బాధితులు దాఖలు చేసిన ఇంటర్వెష్షన్ పిటిషన్లను ఆమోదించామని ధర్మాసనం పేర్కొంది. బాధితులు ఎలాంటి డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు ఉత్తర్వు పేర్కొంది. వీధి కుక్కల కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, బాధితులకు కూడా వారి వాదన వినిపించే అవకాశం ఉండాలని అన్నారు. ఈ మేరకు ఆయన చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

Read Also- High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ప్రశ్న.. ఎప్పుడు నిర్వహిస్తారు?

ప్రతివాదిగా యానిమల్ వెల్ఫేర్ బోర్డు

వీధి కుక్కల కేసులో బాధితులు జోక్యం చేసుకునేందుకు అనుమతించడంతో పాటు సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఈ కేసులో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ప్రతివాదిగా చేర్చాలంటూ అందిన సూచనను న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు యానిమల్ వెల్ఫేర్ బోర్డుకు నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు, ప్రభుత్వ బిల్డింగుల ఆవరణలలో వీధి కుక్కలకు ఆహారం అందించడాన్ని నియంత్రించేందుకు త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని బెంచ్ తెలిపింది. కుక్కలకు ఆహారం అందిస్తున్న ప్రాంతాలకు సంబంధించి సంబంధిత ప్రభుత్వ విభాగాలకు కొద్ది రోజుల్లోనే తాము ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ నాథ్ వెల్లడించారు. వీధి కుక్కల కాట్ల ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో, జనాలకు అవగాహన కల్పించడంపై మరికొన్ని రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు కేసులో జోక్యం చేసుకున్న ఓ వ్యక్తి విజ్ఞప్తి మేరకు జస్టిస్ నాథ్ ఈ క్లారిటీ ఇచ్చారు. న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయకముందే తమ వాదనలు వినాలంటూ ఒక జోక్యం చేసుకున్న సదరు వ్యక్తి తరపున సీనియర్ అడ్వకేట్ కరుణ నందీ అభ్యర్థించినప్పటికీ, బెంచ్ నిరాకరించింది.

Read Also- Chevella Bus Accident: మరో సంచలనం.. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌పై.. హైదరాబాద్‌లో చలాన్లు!

న్యాయవాది నందీ వాదిస్తూ, నిబంధనలు అమలు అవుతున్న విధానం సరిగా లేదని అన్నారు. కుక్కలకు ఆహారం పెట్టే ప్రాంతాలను నిర్ణయించే విధానం సరిగా లేదని ఉదాహరణగా ఆయన వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ సుమారుగా 262 ప్రాంతాలను గుర్తించిందని, కానీ, అక్కడ కేవలం 16 ప్రాంతాలే ఉన్నాయని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కోర్టు.. అమలు విధానాన్ని నిర్ధారించుకోవడానికే ఈ కేసు నేడు (సోమవారం) విచారణకు వచ్చిందని తెలిపింది. జోక్యం చేసుకునే వారి వాదనలు తగిన సమయంలో వింటామని కోర్టు పేర్కొంది.

Just In

01

Dheeraj Mogilineni: వేస్ట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌పై ‘ది గర్ల్ ‌ఫ్రెండ్’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!

Prabhas: ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేయాల్సిన ‘బ్రహ్మరాక్షస్’ డౌటేనా?

Bigg Boss Buzzz: మాధురిపై శివాజీ కౌంటర్స్ చూశారా? ఇది వేరే లెవల్ అంతే..!

TPCC: జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ ‘ఉమెన్స్ వ్యూహం’.. రంగంలోకి 7 మహిళా బృందాలు.. ఏం చేస్తాయంటే?

RT76: ఆషికాతో రొమాన్స్‌లో రవితేజ.. షూటింగ్ అప్డేట్ ఇదే!