Saroor Nagar Lake: సరూర్ నగర్ చెరువుపై.. హైడ్రా కీలక ప్రకటన
Saroor Nagar Lake (Image Source: twitter)
హైదరాబాద్

Saroor Nagar Lake: సరూర్ నగర్ చెరువుపై.. హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన

Saroor Nagar Lake: స‌రూర్‌న‌గ‌ర్ చెరువును పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తెలిపారు. ప్ర‌భుత్వ అనుమ‌తుల‌తో త్వ‌ర‌లోనే ప‌నులు చేప‌డ‌తామ‌ని చెప్పారు. 140 ఎక‌రాల‌కు పైగా ఉన్న చెరువు ప‌రిధిలో చాలా వ‌ర‌కు నివాసాలు వ‌చ్చేశాయన్నారు. ఇప్పుడు వాటి జోలికి వెళ్ల‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం 90 ఎక‌రాల‌కు పైగా మిగిలి ఉన్న చెరువునే అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. న‌గ‌రంలో పెద్ద చెరువుల‌ను కూడా అభివృద్ధి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సూచించారని అందులో స‌రూర్‌న‌గ‌ర్ చెరువు కూడా ఉంద‌న్నారు.

పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం..

బుధవారం సరూర్ నగర్ చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనంతరం మాట్లాడారు. చెరువుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌భుత్వానికి నివేదించి.. మార్చిలోగా ప‌నులు చేప‌డ‌తామ‌న్నారు. ఏడాదిలో ప‌నులు పూర్తి చేస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ తెలిపారు. చెరువుల‌ అభివృద్ధి అంటే పై మెరుగులు దిద్ద‌డం కాద‌ని ఇప్ప‌టికే హైడ్రా పున‌రుద్ధ‌రించిన బ‌తుక‌మ్మ‌కుంట‌, బ‌మృకున్ – ఉద్ -దౌలా, కూక‌ట్‌ప‌ల్లి నల్ల‌చెరువుల‌ను ప‌రిశీలిస్తే అంద‌రికీ ర్థ‌మౌతుంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారు చెప్పారు. ఆ దిశ‌గానే స‌రూర్‌న‌గ‌ర్ చెరువును తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు.

పూడిక తొలగిస్తాం.. లోతు పెంచుతాం

సరూర్ నగర్ చెరువులో 10 నుంచి 15 అడుగుల మేర పూడిక‌ను తొల‌గించి లోతు పెంచుతామని హైడ్రా కమిషన్ అన్నారు. పూడికను తొల‌గించ‌డం ద్వారా నీటి నిలువ సామ‌ర్థ్యం పెంచ‌డ‌మే కాకుండా.. భూగ‌ర్భ జ‌లాల పెరుగుద‌ల‌కు మార్గం సుగ‌మం అవుతుంద‌న్నారు. చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు స‌రిగా ఉండేలా చూస్తాం. మ‌రీ ముఖ్యంగా వ‌ర‌ద‌ల నియంత్ర‌ణ‌కు ఈ చెరువు ఉప‌యోగ‌ప‌డేలా తీర్చిదిద్దుతామ‌న్నారు. మురుగు నీరు చెరువులో క‌ల‌వ‌కుండా వాటర్ బోర్డు సహకారంతో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే.. ఎస్‌టీపీల సామ‌ర్థ్యాన్నిపెంచుతామ‌న్నారు.

Also Read: Davos summit 2026: సీఎం రేవంత్ సంచలనం.. తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. దావోస్‌లో గేమ్ ఛేంజింగ్ ఒప్పందం!

చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్..

చెరువు ప‌రిస‌రాల్లో పెద్ద‌మొత్తంలో ఔష‌ధ‌గుణాలున్న మొక్క‌లు నాట‌డం, ఇప్ప‌టికే ఉన్న ఇందిరా ప్రియ‌ద‌ర్శ‌ని పార్కుతో పాటు మ‌రి కొన్ని ప్రాంతాల్లో పార్కుల‌ను అభివృద్ధి చేయ‌డం ద్వారా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు చెప్పారు. చెరువు చుట్టూ బండ్ తో పాటు వాకింగ్ ట్రాక్‌లు, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా క్రీడా పార్కులు, అన్ని వ‌య‌సుల వారూ వ్యాయామం చేసేందుకు అనువైన ఓపెన్ జిమ్‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. చెరువులోకి మంచి నీరు చేర‌డం వ‌ల్ల దుర్గంధ ప‌రిస్థితులు పోయి చ‌క్క‌టి ఆహ్లాద‌క‌రమైన వాతావ‌ర‌ణం స‌మ‌కూరుతుంద‌న్నారు.

Also Read: IND vs NZ 1st T20I: భారత్ vs కివీస్.. కొద్ది గంటల్లో తొలి టీ-20 మ్యాచ్.. ఎవరు గెలుస్తారు?

Just In

01

Jogipet hospital: జోగిపేట హాస్పిటల్‌లో నలుగురు డాక్టర్ల నిర్వాకం.. వేటుతప్పదా?

Municipal Elections: పార్టీలకు మున్సిపల్ పరీక్ష.. అన్ని పార్టీలను దెబ్బతీస్తున్న సమస్య ఇదే!

Congress Party: గుండెపోటుతో ఓబీసీ నేత మృతి.. మంత్రి కోమటిరెడ్డి ఆపన్నహస్తం

Happy Raj: జీవీ ప్రకాష్ ‘హ్యాపీ రాజ్’ ప్రోమో చూశారా.. అబ్బాస్ రీ ఎంట్రీ అదుర్స్

Athreyapuram Brothers: కొత్త కథాంశంతో ప్రారంభమైన ‘ఆత్రేయపురం బ్రదర్స్’.. నేటి తారానికి తగ్గట్టు