Davos summit 2026: తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. కీలక ఒప్పందం!
Davos summit 2026
Telangana News

Davos summit 2026: సీఎం రేవంత్ సంచలనం.. తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. దావోస్‌లో గేమ్ ఛేంజింగ్ ఒప్పందం!

Davos summit 2026: దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తో.. తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు రష్మి గ్రూప్‌తో రూ.12,000 కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

మంత్రి శ్రీధర్ బాబు హామీ.. 

కాగా, తెలంగాణ విభిన్న పరిశ్రమలతో బలమైన పారిశ్రామిక వ్యవస్థగా ఎదుగుతోందని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తయారీ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయాలు, బొగ్గు సరఫరా లింకేజీలు సహా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు రష్మి గ్రూప్ డైరెక్టర్ సంజిబ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్.. లేబర్–ఇంటెన్సివ్ తయారీ విధానంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరోవైపు గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి కూడా చర్చలు జరిగినట్లు రష్మి గ్రూప్ తెలిపింది. కాగా రష్మీ గ్రూప్ ఆసియాలోని 40 దేశాలతో పాటు యూరప్, ఆఫ్రికా, అమెరికా దేశాల్లోనూ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

ఏబీ ఇన్‌బెవ్‌తోనూ ఒప్పందం

ప్రపంచ అతిపెద్ద బీరు తయారీ సంస్థ ఏబీ ఇన్‌బెవ్ (AB InBev)తోనూ దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఒప్పందం చేసుకున్నారు. ఏబీ ఇన్‌బెవ్ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్తో సమావేశం సందర్భంగా ఈ మేరకు అంగీకారం కుదిరింది. దీని ప్రకారం తెలంగాణలో ఇప్పటికే ఉన్న తన తయారీ యూనిట్లను విస్తరించేందుకు భారీగా ఏబీ ఇన్‌బెవ్ పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 50కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్‌బెవ్.. సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది.

Also Read: Sangareddy District: చెల్లిని ప్రేమించాడని.. ప్రియుడ్ని అడవిలోకి తీసుకెళ్లి.. అన్నలు దారుణం!

ప్రపంచ స్థాయి మౌలిక వసతులు

ఏబీ ఇన్‌బెవ్ (AB InBev) ప్రతినిధులతో భేటి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. విధాన స్థిరత్వం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, వ్యాపార సౌలభ్యంతో తెలంగాణలో పెట్టుబడిదారుల్లో దీర్ఘకాలికంగా విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో సర్క్యులర్ వాటర్ వినియోగం, మహిళా సాధికారత, విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించిన సీఎస్‌ఆర్ వ్యయాలు వంటి అంశాల్లో తెలంగాణతో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా చర్చించారు. బీర్ యూనిట్ల విస్తరణ రూపంలో రాష్ట్రానికి కొత్త పెట్టుబడి లభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Also Read: Davos Summit 2026: దావోస్‌లో సీఎం దూకుడు.. రేవంత్ విజన్‌కు టాప్ కంపెనీలు ఇంప్రెస్.. మరో భారీ డీల్ సెట్!

Just In

01

Jogipet hospital: జోగిపేట హాస్పిటల్‌లో నలుగురు డాక్టర్ల నిర్వాకం.. వేటుతప్పదా?

Municipal Elections: పార్టీలకు మున్సిపల్ పరీక్ష.. అన్ని పార్టీలను దెబ్బతీస్తున్న సమస్య ఇదే!

Congress Party: గుండెపోటుతో ఓబీసీ నేత మృతి.. మంత్రి కోమటిరెడ్డి ఆపన్నహస్తం

Happy Raj: జీవీ ప్రకాష్ ‘హ్యాపీ రాజ్’ ప్రోమో చూశారా.. అబ్బాస్ రీ ఎంట్రీ అదుర్స్

Athreyapuram Brothers: కొత్త కథాంశంతో ప్రారంభమైన ‘ఆత్రేయపురం బ్రదర్స్’.. నేటి తారానికి తగ్గట్టు