IND vs NZ 1st T20I: కాసేపట్లో తొలి టీ-20.. గెలిచేది ఎవరు?
IND vs NZ 1st T20I
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

IND vs NZ 1st T20I: భారత్ vs కివీస్.. కొద్ది గంటల్లో తొలి టీ-20 మ్యాచ్.. ఎవరు గెలుస్తారు?

IND vs NZ 1st T20I: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు తొలి టీ-20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్ 2-1ను కైవసం చేసుకొని కివీస్ జట్టు దూకుడు మీద ఉండగా.. టీ-20ల్లోనైనా ప్రతీకారం తీర్చుకోవాలని సూర్యకుమార్ నేతృత్వంలోని యువ భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల విజయావకాశాలు, పిచ్ రిపోర్టు, గత రికార్డులపై ఓ లుక్కేద్దాం.

తిలక్ స్థానంలో ఇషాన్..

భారత జట్టు విషయానికి వస్తే.. గాయం కారణంగా దూరమైన తిలక్ వర్మ స్థానంలో ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాడు. ఓపెనింగ్ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ చేయనున్నారు. మూడో స్థానంలో ఇషాన్ కిషన్, నాల్గో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నారు. అయితే కెప్టెన్ సూర్య ఫామ్ ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని టీ20ల నుంచి సూర్య ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. టీ20 వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్న ఆఖరి టీ-20 సిరీస్ కావడంతో ఈసారి ఫామ్ లోకి రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

నాగ్ పూర్ పిచ్ రిపోర్టు..

దేశంలోని అత్యంత ఫ్లాట్ ట్రాక్ కలిగిన క్రికెట్ స్టేడియంలో ఒకటిగా నాగ్ పూర్ పిచ్ ప్రసిద్ధి చెందింది. ఈ మైదానం బ్యాటర్లకు స్వర్గధామంగా ఉంటుంది. బ్యాటర్ నిలదొక్కుకుంటే చాలా తేలిగ్గా పరుగులు రాబట్టవచ్చు. ఫ్లైట్ డెలివరీ వేసే స్పిన్నర్లకు సైతం పిచ్ అనూకూలంగా ఉండనుంది. ఛేజింగ్ చేసే జట్లకు నాగ్ పూర్ పిచ్ పై గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. నాగ్ పూర్ వాతావరణం విషయానికి వస్తే మ్యాచ్ కు వర్షం అంతరాయం లేదు. గాలిలో తేమ శాతం 48 – 56% అంచనా. మ్యాచ్ గడిచే కొద్ది మంచు ప్రభావం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

జట్ల బలాబలాలు..

భారత్ – కివిస్ గత రికార్డుల విషయానికి వస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకూ 25 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో భారత్ 12 గెలిస్తే.. కివీస్ పదింటిలో విజయం సాధించింది. మూడు మ్యాచ్ లు డ్రాగా ముగిసాయి. ఇరు జట్ల మధ్య చివరిగా 2023 ఫిబ్రవరి 1న టీ20 మ్యాచ్ జరగ్గా.. అందులో భారత్ గెలవడం గమనార్హం. గత కొంతకాలంగా వరుసగా సిరీస్ లు గెలుస్తూ వస్తోన్న యువ భారత జట్టు.. ఈ 5 టీ-20 సిరీస్ లోనూ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ప్లేయర్ల ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్ లో టీమిండియానే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Viral Video: అగ్గిపెట్టెంత ఇల్లు.. రూ.1.2 కోట్లు అంట.. కొనేవాళ్లు మరీ అంత పిచ్చోళ్లా!

మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి?

సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ ను జియో హాట్ స్టార్ యాప్, వెబ్ సైట్ లో వీక్షించవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఛానళ్లలోనూ చూడవచ్చు. అయితే మ్యాచ్ ను ఉచితంగా చూసే అవకాశాన్ని సైతం జియో కల్పించింది. కొన్ని మెుబైల్ రీఛార్జ్ ప్లాన్స్ తో కలిపి జియో హాట్ స్టార్ ను ఉచితంగా అందిస్తోంది. సదరు ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే ఫ్రీగా హాట్ స్టార్ లో మ్యాచ్ చూడొచ్చు.

భారత జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, హర్షిత్ రానా/ శివం దూబే, అర్షదీప్ సింగ్/కుల్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

Also Read: Davos Summit 2026: దావోస్‌లో సీఎం దూకుడు.. రేవంత్ విజన్‌కు టాప్ కంపెనీలు ఇంప్రెస్.. మరో భారీ డీల్ సెట్!

Just In

01

Allu Arjun: అల్లు అర్జున్ ‘AA23’లో పూజ హెగ్డే.. అలా వైకుంఠపురంలో రిపీట్ అవుతుందా..

Saroor Nagar Lake: సరూర్ నగర్ చెరువుపై.. హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన

Municipal Elections: మునిసిపల్ ఎన్నికల ముందు నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ పార్టీకి షాక్

Medchal Congress: మేడ్చల్ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం.. కారణం ఇదే

Davos summit 2026: సీఎం రేవంత్ సంచలనం.. తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. దావోస్‌లో గేమ్ ఛేంజింగ్ ఒప్పందం!