Labour Card: లేబర్ కార్డు అంటే మీకు తెలుసా.. ఈ కార్డుతో కలిగే లాభాలేంటి? ఇది ఎలా ఉంటుంది దీనిని ఎవరు ఇస్తారు? ఎక్కడ దొరుకుతుంది మీకు తెలుసా అంటే.. సాదారణంగా దీనిగురించి అందరికి తెలియదు. చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. లేబర్ కార్డు(Labor card) ద్వారా ఎన్ని లాభాలో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు దీన్ని ఎందుకు ప్రవేశ పెట్టారు. దీనిని ఏవిధంగా ఉపయోగించాలి. దీనివలన కలిగే ప్రయోజనాలేంటో పూర్తిగా తెలుసుకుందాం..
ఎన్ని వర్గాల వారు వస్తారు
రేషన్ కార్డు(Ration card) కలిగి ఉండి కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం, భూమిలేని నిరుపేదల వారు దీనికి అర్హులు. లేబర్ కార్డు అనేది(Ration card) ప్రభుత్వ కార్మికశాఖ(Labor Department) జారీ చేసే ఓక గుర్తింపు కార్డు. దీనిద్వారా కార్మికులకు ఆర్ధిక, సాంఘీక సంక్షేమ పథకాలు, మరియు వివిధ రకాల పౌరసేవలను పొందవచ్చు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగం(Construction sector)లోని వారికి ఎక్కువగా దీన్ని జారీచేస్తుంటారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే కొన్ని పథకాలలో ఈ కార్డు కలిగిన వ్యక్తులకు ఇటు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలలో కొన్నింటికి ప్రత్యేక మైన మినహ ఇంపులతో కూడిన అవకాశాలను కల్పిస్తారు. దీంతో ఇ కార్డు కలిగిన వారికి కొంత మంచే జరుగుతుందని చెప్పవచ్చు, వ్యవసాయ కార్మికులు(Agricultural laborers), మత్స్యకారులు(fishermen), చిన్న తరహ పరిశ్రమల(small-scale industries)లో పనిచేసే కార్మకులు, నిత్యం పనిచేసే లేబర్ వారు దీనికి అర్హులుగా పేర్కోంటారు.
Also Read: Gajwel Congress: గజ్వేల్ కాంగ్రెస్ నేతల్లో బలపడుతున్న సంకల్పం.. చేయి కలిపిన మరో వర్గ నేత..?
ఎలా అప్లై చేసుకోవాలి..?
వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు కలిగిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఆన్ లైన్‌లో లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ సేవ(Mee Seva)లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అప్లైచేసే వారు తమ తమ రాష్ట్ర కార్మికశాఖ వెబ్ సైట్(State Labour Department website) ని సంప్రదించాల్సిఉంటుంది. TBOCWWB పోర్టల్ ద్వారా అయితే తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా కావలసిన పత్రాలు రేషన్ కార్డు(Ration card)తో పాటు, భ్యాంక్ ఎకౌంట్(Bank Acount) పాస్ బుక్, ఆదార్ కార్డు(Aadhaar card), పాన్ కార్డు(PAN card)ను జతచేసి ఆన్లైన్ సెంటర్ లేదా మీసేవ(Mee Seva)లో అప్లై చేసుకొవచ్చు. ఇది అప్లై చేసిన తరువాత ఓక వారం నుండి 15 రోజులు కార్డు రావడాని సమయం పడుతుంది. అనంతరం కార్డు వచ్చాక అటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే లేబర్ చట్టాల పథకాలకు అర్హులుగా పేర్కోంటారు.
Also Read: Seetha Payanam: సంక్రాంతి స్పెషల్‌గా ‘సీతా పయనం’ నుంచి బసవన్న వచ్చేశాడు..

