Bangladesh: బంగ్లాదేశ్‌లో గత కొన్ని నెలలుగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. అక్కడ మైనారిటీలే టార్గెట్‌గా చేసుకుని కొందరు దుండగులు తీవ్ర హింసకు గురి చేస్తున్నారు. తాజాగా సిల్హెట్‌లోని ఓ ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ డే(Birendra Kumar Dey) ఇంటికి నిప్పంటించిన కొంతమంది దుండగులు నిప్పు అంటించారు. గత కొన్ని వారాలుగా మైమెన్ సింగ్(Mymensingh), ఫిరోజ్‌పూర్(Firozpur), చిట్టగాంగ్(Chittagong)లలో హిందూ కుటుంబాలే లక్ష్యంగా దాడులు, హత్యలు, దహనకాండలు చేస్తున్నారు. చిట్టగాంగ్‌లో అయితే దారుణ సంఘటన సైతం చోటుచేసుకుంది.
8 మందిని ఇంట్లో పెట్టి నిప్పంటించి..
ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని ఇంట్లో పెట్టి బయట లాక్ చేసి దుండగులు నిప్పంటించొన సంఘటన సంచం రేపింది. దీంతో ఆ కుటుంబం తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. మోన్న 8 వ తేదీన సనామ్ గంజ్ అనే ప్రాంతంలో ఓ 22 ఎల్ల హిందూ యువకుడి పై కిడ్నాప్ చేసి అతడిని భందించి తీవ్రంగా హింసించారు. తరువాత అతనికి చంపేందకు బలవంతంగా విషం తాగించి చంపిచ్చినట్టు బాదితకుటుబికులు చెప్పిన సంఘటన సంచనం సృష్టించింది.
Also Read: Medaram Jatara: మేడారం జాతర పనుల పురోగతిపై మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ..!
ఐక్యరాజ్య సమితి డిమాండ్
బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలకు అంతర్జాతీయం సంస్ధలు స్పందించాయి. అక్కడి పరిస్ధతులను అనిచివేసి ప్రజలు శాంతి భద్రతలు కాపాడాలని వివిధ హిందూసంఘాలు కోరాయి. మానవ హక్కుల ఉల్లంఘనలు మత పరమైన హింసలపై ఆందోళనను వ్యక్తం చేస్తూ అక్కడ జరుగుతున్న సంఘటనలపై పూర్తిగా దర్యాప్తు చేయాలని ఐక్యరాజ్య సమితి డిమాండ్ చేసింది. హిందూ కుటుంబాలు ప్రాణాపాయంతో సరిహద్దులు చూస్తూ రక్షణ కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే వారికి రక్షణ కల్పించాలని కోరారు. భారత విదేశాంగ శాఖ ఈ సంఘటనలపై తీవ్రంగా ఖండించింది. మైనారిటీల భద్రత బంగ్లాదేశ్ దే అని ఘాటుగా తెలిపింది. దీనికి పూర్తి భాద్యత ప్రభుత్వమే వహించాలని తెలిపింది.
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై కొనసాగుతున్న హింస
తాజాగా సిల్హెట్‌లోని ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ డే ఇంటికి నిప్పంటించిన దుండగులు
గత కొన్ని వారాలుగా మైమెన్ సింగ్, ఫిరోజ్‌పూర్, చిట్టగాంగ్‌లలో హిందూ కుటుంబాలే లక్ష్యంగా దాడులు, హత్యలు, దహనకాండలు
చిట్టగాంగ్‌లో ఒకే కుటుంబానికి… pic.twitter.com/7iWrqf8211
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2026
Also Read: Champion Movie: ‘ఛాంపియన్’ సూపర్ హిట్ సాంగ్ ‘గిర గిర గింగిరాగిరే’ ఫుల్ వీడియో వచ్చేసింది..

