Champion Movie: ‘గిర గిర గింగిరాగిరే’ ఫుల్ వీడియో వచ్చేసింది..
Gira-Gira-Gingiragire-Video-Song-Released
ఎంటర్‌టైన్‌మెంట్

Champion Movie: ‘ఛాంపియన్’ సూపర్ హిట్ సాంగ్ ‘గిర గిర గింగిరాగిరే’ ఫుల్ వీడియో వచ్చేసింది..

Champion Movie: ‘పెళ్లి సందD’ చిత్రంతో సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న యువ కథానాయకుడు రోషన్ మేక ప్రస్తుతం ‘ఛాంపియన్’ అనే విభిన్న కథాంశంతో కూడిన చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా, ఈ చిత్రం నుంచి విడుదలైన ‘గిర గిర గింగిరాగిరే’ ఫుల్ వీడియో విడుదలైంది. ఇప్పటికే ఈ సాంగ్ ఆడియో చాట్ బాస్టర్ గా మారి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు సంబంధించిన వీడియా సాంగ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ అందించిన సంగీతం, ఈ పాటను వినసొంపైన మెలోడీగా మార్చింది. ఆయన తనదైన శైలిలో పల్లెటూరి వాతావరణానికి సరిపోయే మాస్ బీట్‌ను, మెలోడీ టచ్‌ను జోడించి యువతను కదిలించే ఫీల్‌ను తీసుకొచ్చారు. ‘గిర గిర గింగిరాగిరే’ అంటూ సాగే ఈ పాట లిరిక్స్ కూడా సాధారణ శ్రోతలకు త్వరగా కనెక్ట్ అయ్యే విధంగా, సులువుగా పాడుకునే విధంగా ఉన్నాయి.

Read also-The Raja Saab: ముగ్గురు భామలతో రాజా సాబ్.. పోస్టర్ అదిరిపోలా..!

ఈ వీడియోలో హీరోయిన్ పాత్ర చంద్రకళగా నటించిన అనస్వర రాజన్ ఆమె పక్కా గ్రామీణ సెటప్‌లో, చీరకట్టులో ఎంతో అందంగా, సహజంగా కనిపిస్తున్నారు. చంద్రకళ పాత్ర యూత్‌కి బాగా నచ్చే విధంగా, ఉల్లాసంగా, చురుకుగా తీర్చిదిద్దినట్లు గ్లింప్స్‌లో తెలుస్తోంది. అనస్వర రాజన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆమె హావభావాలకు ప్రేక్షకులు క్లీన్‌గా ఫిదా అవుతున్నారు. ఇక, ఈ చిత్రంలో హీరో రోషన్ మేక, హీరోయిన్ అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ కూడా స్క్రీన్ మీద చూడటానికి చాలా బాగుందని ఈ గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది. ఇద్దరూ కలిసి పక్కా గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమ కథను తమ అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే విధంగా ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. ఈ ‘గిర గిర గింగిరాగిరే’ ఇప్పటికే 2025 హిట్ సాంగ్ లిస్ట్ లోకి చేరిపోయింది. దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విధానం, ముఖ్యంగా ఈ పాటలో చూపించిన విలేజ్ వాతావరణం, సహజత్వం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి.

Read also-Mega Interview: మెగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో వచ్చేసింది..

Just In

01

Maoist Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్.. 52 మంది మావోయిస్టులు సరెండర్..!

Nabha Natesh: అతిలోక సుందరిలా నభా.. ‘నాగబంధం’ ఫస్ట్ లుక్ చూశారా?

Seetha Payanam: సంక్రాంతి స్పెషల్‌గా ‘సీతా పయనం’ నుంచి బసవన్న వచ్చేశాడు..

Madhira Municipality: మధిర మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: భట్టి విక్రమార్క

VT15 Title Glimpse: వరణ్ తేజ్ ‘VT15’ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?..