The Raja Saab: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండగ వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే. ఈసారి సంక్రాంతి (Sankranthi 2026)కి ఆ మ్యాజిక్ మాములుగా లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ‘ది రాజా సాబ్’ (The Raja Saab)తో మొదలైన సందడి, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ వరకు బాక్సాఫీస్ షేకవుతూనే ఉంది. హారర్ రొమాంటిక్ కామెడీగా వచ్చిన ‘ది రాజా సాబ్’ టాక్ కాస్త వీక్‌గా ఉన్నా.. కలెక్షన్లపరంగా మాత్రం థియేటర్లలో సందడి తగ్గలేదు. చిరంజీవి, రవితేజ, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ మాత్రం మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని, బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నింపేసి, థియేటర్లు కళకళలాడేలా చేశాయి. ఇక విడుదలైన అన్ని సినిమాలతో పాటు, రెడీ అవుతున్న కొత్త సినిమాల నుంచి సంక్రాంతి శుభాకాంక్షలతో (The Raja Saab Sankranthi Wishes) న్యూ పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి విడుదలైన సంక్రాంతి స్పెషల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Also Read- Yellamma Glimpse : పూనకాలు తెప్పిస్తున్న‘ఎల్లమ్మ’ గ్లింప్స్.. డీఎస్పీని చూస్తే గూస్‌బంప్సే..
కలర్‌ఫుల్ అండ్ క్లాసీ వైబ్స్
ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమా ఎంత కలర్‌ఫుల్‌గా రూపుదిద్దుకుందనేది అర్థమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ అదిరిపోయిందనే విషయం తెలియంది కాదు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా, ప్రభాస్ లుక్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిన పోస్టర్‌లో సంప్రదాయబద్ధమైన షేర్వానీలో, స్టైలిష్ షేడ్స్ పెట్టుకుని ప్రభాస్ తనదైన వింటేజ్ చార్మ్‌తో మెరిసిపోతున్నారు. ఆయన ముందున్న ముగ్గురు హాట్ భామలు.. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్.. గాంధీ స్లోగన్‌ని పెర్ఫార్మ్ చేస్తున్నారు. ‘ఒక చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు’ అనే సింబాలిక్ పోజులతో.. ఈ సినిమా టాక్ గురించి, నెగిటివ్ కామెంట్స్‌కు కౌంటర్ అనేలా కనిపిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇందులో వారు ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నా, గ్లామర్ ట్రీట్ మాత్రం మిస్సవలేదు.
Also Read- Polaki Vijay: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సక్సెస్ వేళ.. విజయ్ పొలాకి మరోసారి ఎమోషనల్ పోస్ట్!
మారుతి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకుడు మారుతి తన మార్క్ కామెడీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని మలిచారు. ముఖ్యంగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలవగా, సినిమాలోని విజువల్స్ పండగ కళను రెట్టింపు చేస్తున్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే, డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించారని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మాస్ యాక్షన్ సినిమాలే కాదు, ఇలాంటి డిఫరెంట్ జోనర్స్ కూడా ప్రభాస్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపిస్తోందని, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సంక్రాంతికి థియేటర్లకు క్యూ కడుతున్నారని, తెలుపుతూ మేకర్స్ ‘కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్’ అనే పోస్టర్‌ను వదిలారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

