Medaram Jatara: మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని, ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srnivas Reddy) అన్నారు. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టగా, ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం పడిగపూర్ కు హెలికాప్టర్ లో విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. గారు, ఎస్.పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటిడిఏ పి ఓ చిత్ర మిశ్రా పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు ఆర్టీసీ బస్టాండ్, జంపన్న వాగు, స్తూపం రోడ్లను వాహనంలో పరిశీలించి, శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దేల పునరుద్ధరణ పనులను పరిశీలించి, వన దేవతలను దర్శించుకున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన
అనంతరం ఆలయ ప్రాంగణం లోని ల్యాండ్ స్కేపింగ్ పనులను, ప్రధాన ద్వారం ఫ్లోరింగ్ పనులను పరిశీలించి స్వయంగా ఫ్లోరింగ్ కింది భాగంలో ఇసుక ఎంత మేరకు నింపుతున్నారో పరిశీలించారు. పి టి భీమ్స్ పై అమర్చుతున్న బ్రాకెట్ లను, మీడియా టవర్స్ నిర్మాణాలను, క్యూ లైన్స్ షేడ్స్ లను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కల్చరల్ ప్రాంగణ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల పరిశీలనలో భక్తులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు వెళ్ళారు. అనంతరం హరిత హోటల్ లో మంత్రులు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని, రహదారులపై ఉన్న మట్టి, ఇతర వ్యర్ధాలు వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారుల సెంట్రల్ లైటింగ్ డివైడర్ మధ్యలో సుందరీకరణ చెట్లను నాటాలని, అవసరం ఉన్న చోట కూలీల సంఖ్య పెంచుకొని పనులు జరిగేలా చూడాలని అన్నారు.
వివిధ రకాల పూలతో..
పనుల విషయంలో అధికారులు, గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారిని ఐనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాతర పరిసరాలను జోనల్, యూనిట్ విధంగా విభజించి జోనల్ కు ఒక ప్రత్యేక అధికారిని నియమించి బాధ్యతలను అప్పజెప్పాలని ఆలయ ప్రాంగణా పరిసరాలలో మిగిలిన వ్యర్ధాలను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. డివైడర్ పనులు పూర్తయ్యాక వెంటనే ఫైర్ ఇంజిన్లతో అన్ని రహదారులపై క్లీనింగ్ నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ ప్రాంగణ రాతి స్తంభాలకు పచ్చదనంగా వివిధ రకాల పూలతో సుందరీకరించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. మేడారం జాతర రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమమని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి శివం ఉపాధ్యాయ గారు, ఏటూరు నాగారం అదనపు ఎస్పీ మనన్ భట్ గారు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు గారు, ఆర్ డి ఓ వెంకటేష్ గారు, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Alson Read: Mega Interview: మెగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో వచ్చేసింది..

