Janwada Land Scam: సత్యం కంప్యూటర్స్ కేసులో బిగ్ ట్విస్ట్..!
Janwada Land Scam (imagecredit:twitter)
Telangana News, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Janwada Land Scam: సత్యం కంప్యూటర్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి రాని వందల ఎకరాలు

Janwada Land Scam: సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి రాని వందల ఎకరాలు
– ఈడీ కోర్టులో ఏ 12 అభినవ్ పిటిషన్
– జన్వాడ ల్యాండ్ స్కాంపై వాంగ్మూలం ఇస్తానని స్పష్టం
– 90 ఎకరాల్లో చేతులు మారిన వందల కోట్లు
– అక్రమ రిజిస్ట్రేషన్లు.. లావాదేవీలు
– కేటీఆర్ ఫాంహౌజ్ కూడా అందులో భాగమేనా?
– నేడు ఈడీ స్పెషల్ కోర్టులో విచారణ
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్: సత్యం రామలింగరాజు.. 2009కి ముందు ఐటీ రంగంలో ఈ పేరు ఓ బ్రాండ్. తర్వాత అదే ఐటీ రంగాన్ని కుదిపేసి మాయని మచ్చగా మిగిలిపోయింది. సత్యం కంప్యూటర్స్ లాభాలు, నగదు నిల్వలను ఏళ్ల తరబడి పెంచి చూపించి దాదాపు రూ.7 వేల కోట్ల స్కాం కు తెరతీశారు. అయితే, ఈ బైరాజు రామలింగరాజు సత్యం స్కాం మాటున హైదరాబాద్ చుట్టుపక్కల బినామీ కంపెనీలతో వేల ఎకరాలు కొనుగోలు చేశారు. స్కాం బయటకొచ్చిన 2009లో సీఐడీ, సీబీఐ కేసులు నమోదు చేసినా మనీ ల్యాండరింగ్ గురించి దర్యాప్తు జరపలేదు. ఎకనామిక్ అఫెన్స్ వింగ్(ఈవోడబ్ల్యూ) దర్యాప్తు జరిపినా అసలు నిజాలు బయటకు రాలేదు. అయితే, 2014లో ఈడీ కేసు(ఎస్‌సీ నెం. 1/2014) నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు డిశ్చార్జ్ పిటిషన్స్‌తో కొనసాగుతూనే ఉన్నది. కేసులోని ఏ 153 శతభిష కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న తన స్టేట్మెంట్‌ను సాక్షిగా సీఆర్‌పీసీ 164 ప్రకారం రికార్డ్ చేయాలంటూ ఏ 12 అభినవ్ అల్లడి ఈ మధ్యే ఈడీ కోర్టులో వేసిన పిటిషన్ సంచలనంగా మారింది. సీఆర్ఎల్ఎంపీలో అభినవ్, తాను సాక్షిగా ఏం జరిగిందో చెప్పడానికి అవకాశం ఇవ్వండి అంటూ శతభిష కంపెనీ పేరుతో ముందుకు రావడం ఆనాటి వందల ఎకరాల బినామీ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి కొత్త అనుమానాలకు దారి తీస్తున్నది. అభినవ్ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరగనున్నది. ఈయన స్టేట్మెంట్ ప్రకారం ఈడీ సమాధానం చెప్పనున్నది.


గతంలో ఏం జరిగిందంటే?

2009కి ముందు సత్యం కంప్యూటర్స్ అంటే మన దగ్గర మైక్రోసాఫ్ట్ తరహాలో ఫీల్ అయ్యేవారు. వేల ఉద్యోగులు ఇచ్చింది. అమెరికాలో కూడా లిస్టెడ్ కంపెనీగా నమోదైంది. అయితే, షేర్స్ ధరను పెంచేసి తప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్‌తో భారీ స్కాం కు తెరతీశారు. ఈ మోసాలకు సంబంధించి నమోదైన అభియోగాలపై 2009లో (ఈసీఐఆర్ నెం.1/హెచ్ఎన్ఓ/2009/209) కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణల తర్వాత శిక్ష పడింది. 2015లో సీబీఐ కోర్టు సత్యం కంప్యూటర్స్ ఛైర్మన్(ప్రస్తుతం మాజీ) రామ లింగరాజుతో పాటు 9 మందికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా విధించింది. అయితే, మనీ లాండరింగ్‌కు సంబంధించి ఆ సమయంలో ఎవరూ అంతగా ఫోకస్ చేయలేదు. బినామీల పేరుతో సత్యం రామలింగరాజు హైదరాబాద్ చుట్టూ భారీగా భూములు కొనుగోలు చేశారు. ఆ లావాదేవీలు ఏవీ బయటకు రాలేదు. చివరకు ఆ బినామీలు, వారి కుటుంబ సభ్యులు కేసులను ఎదుర్కొంటున్నారు. సాక్షిగా మారతామని ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.

Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జులుగా.. తెలంగాణ మంత్రులు.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే!


వందల ఎకరాలు బయటకు వస్తాయా?

సత్యం రామలింగరాజు వారసులు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో బినామీ భూములను ఆశగా చూపించి లాబీయింగ్ చేస్తుంటారు. ఈవోడబ్ల్యూ కేసుల్లో మేనేజ్ చేసుకుంటూ రావడమే అందుకు నిదర్శనం. అయితే, జన్వాడ ల్యాండ్ వ్యవహారాలపై ‘స్వేచ్ఛ’ ఎడిటర్ అండ్ టీం మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి బలాన్ని చూకూర్చుతూ ఇవాళ ఏ 12 అభినవ్ వేసిన పిటిషన్ ఈడీ కోర్టులో విచారణకు రానున్నది. జన్వాడలోని సర్వే నెంబర్ 311/1 లో 3.10 ఎకరాలు(ఖాతా నెం. 60699), 306 నుంచి 316 వరకు ఉండే సర్వే నెంబర్స్‌లోని భూములను సత్యం కంప్యూటర్స్ మోసాలతో కొనుగోలు చేసింది. ఈ భూములు మొదట మదన్ గోపాల్, శ్యామ్‌లాల్(1954-1990 పహాణీల ప్రకారం) పేర్లపై ఉండేవి. తర్వాత రికార్డులు మార్చారు. రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చి, రాజకీయ నాయకుల సహకారంతో ఏ 153 శతభిష కంపెనీని ఫ్రాడ్‌గా ఎంటర్ చేశారు. క్రమంగా 50కి పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఈ సర్వే నెంబర్లలోని మొత్తం 90 ఎకరాల విలువ రూ.2 వేల కోట్లకు పైనే ఉండొచ్చని అంచనా. అభినవ్ పిటిషన్, ఈడీ కోర్టు విచారణ నేపథ్యంలో ఈ తీగ లాగి మిగిలిన వందల ఎకరాల డొంకంతా కదులిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బినామీలు దక్కించుకునే ప్రయత్నం

ఆనాడు 252 కంపెనీలను సృష్టించిన సత్యం రామలింగరాజు బినామీల మాటున హైదరాబాద్ చుట్టుపక్కల వందల ఎకరాలు వెనకేసుకున్నారు. అయితే, ఆ బినామీలు ఇప్పుడు భూముల కోసం ఫైట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలతో అంటగాగిన వారంతా రికార్డులు మార్చుకుని భూములు లాగేసుకున్నారు. అయితే, టైటిల్‌పై బినామీల సంతకాలు లేకపోవడంతో తేడా కొడుతున్నాయి. సెక్షన్ 311 సీఆర్‌పీసీ కింద డాక్యుమెంట్లు(పబ్లిక్ డొమైన్‌లో ఉన్నవి) రికార్డులో పెట్టాలనే డిమాండ్ ఉన్నది. అవసరమైతే సెక్షన్ 319 సీఆర్‌పీసీ కింద అధికారులను సైతం విచారించాలని కొందరు కోరుతున్నారు. సెక్షన్ 44 అండ్ 45 పీఎంఎల్ఏ కింద అనుమతి ఇచ్చి మొత్తం ఆస్తులపై కూడా విచారణ జరపాలని అడుగుతున్నారు. ఈ సమయంలోఈడీ కోర్టు విచారణ జరుపుతుండగా ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొన్నది.

Also Read: NTR Death Anniversary: ఆయనలా స్వార్థం లేకుండా ఈ రోజున రాజకీయం చేయగలరా?

Just In

01

Aakasamlo Oka Tara: దుల్క‌ర్ స‌ల్మాన్‌ సరసన నటించే తార లుక్ విడుదల.. ఎంత బావుందో!

CM Revanth Reddy: తెలంగాణ మంత్రులకు సీఎం వార్నింగ్.. ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే కుట్ర..?

Victorian Disease: అమెజాన్ గిడ్డంగిలో ‘విక్టోరియన్’ కేసులు నిర్దారణ… అసలేంటి వ్యాధి?, లక్షణాలు ఇవే

VT15: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 15వ మూవీ టైటిల్ ఇదే.. గ్లింప్స్ అదిరింది

Medchal News: మేడ్చల్లో 2 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన అధికారులు