Congress Party: కాంగ్రెస్ పార్టీ మానవీయ చొరవ
హార్ట్ ఎటాక్‌తో మృతి చెందిన ఓబీసీ నేత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
మృతుడి కూతురికి ఉద్యోగం ఇస్తామని హామీ – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
మేడ్చల్ స్వేచ్ఛ: ఉమ్మడి మేడ్చల్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు, డబిల్పూర్ నివాసి శ్రీనివాస్ గౌడ్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మానవీయంగా స్పందించింది. మృతుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఎల్లంపేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విఘ్నేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సహాయ కార్యక్రమం నిర్వహించగా, రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) మృతుడి కుటుంబ సభ్యులకు స్వయంగా నగదు అందజేశారు.
Read Also- AR Rahman: ఏఆర్ రెహమాన్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఆర్జీవీ.. ఏం జరిగిందంటే?
కుటుంబానికి అండగా కాంగ్రెస్
ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీనివాస్ గౌడ్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన నాయకుడి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుడి కూతురికి తగిన ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వం పరంగా చేయాల్సిన సహాయం చేస్తామని తెలిపారు.అనంతరండీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. కష్టకాలంలో ముందుండి సహాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని స్పష్టం చేశారు.

