AR Rahman: టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సారి ఏఆర్ రెహమాన్ వివాదంలోకి అనుకోకుండా వచ్చి చేరారు. తనకు సంబంధం లేకపోయినా.. ఎప్పుడో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఏఆర్ రెహమాన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపుతున్నాయో తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆయనపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఆర్జీవీ ఎప్పుడో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది వరకు కొన్ని సందర్భాల్లో ఏఆర్ రెహమాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా మరో సారి వైరల్ అవుతున్నాయి. ఒకానొక సందర్భంలో ఏఆర్ రెహమాన్ తో ఎలా నెట్టకొచ్చారో, అసలు ఏఆర్ రెహమాన్ ఎలా ఉండేవారో అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ఒక సందర్భంలో తనతో పని చేయించుకోవడానికి ఎక్కువగా ఇస్లాంకు సంబంధించిన మాటలు చెప్పేవాడిని, అంతే కాకుండా రెహమాను అసలు ఎంతగా ఇస్లాంమ్ ను ఇష్టపడతాడో అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆర్జీవీ వీటి గురించి వివరణ ఇచ్చారు.
Read also-Tollywood Crisis: అందుకే సినిమాలు చూడలేకపోతున్నా.. ప్రముఖ నిర్మాత.. నీళ్లు కూడా దొరకవు..
దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. ‘సంబంధిత వ్యక్తులందరికీ.. ‘జై హో’ పాట విషయంలో నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మరియు సందర్భం లేకుండా వాడుతున్నారు. నా దృష్టిలో ఏఆర్ రెహమాన్ గొప్ప సంగీత దర్శకుడు మాత్రమే కాదు, నేను కలిసిన అత్యంత మంచి వ్యక్తి కూడా. ఇతరుల క్రెడిట్‌ను లాక్కునే వ్యక్తి ఆయన అస్సలు కాదు. ఈ వివరణతో ఈ అంశంపై జరుగుతున్న ప్రతికూల ప్రచారానికి ముగింపు పడుతుందని నేను ఆశిస్తున్నాను.’ అంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు. అయితే ఇక్కడితో ఈ వివాదం ముగుస్తుందో లేదో చూడాలి మరి.
Read also-Sonu Sood Praises Pawan: డిప్యూటీ సీఎం పవన్‌పై సోనూసూద్ పొగడ్తలు.. వీడియో ఇదిగో
To all concerned .. I am being misquoted and misread out of context in the matter of the Jai ho song . .. in my view @arrahman is the greatest composer and the nicest human being I ever met and he’s the last person to take away anybody’s credit ..I hope this puts an end to the…
— Ram Gopal Varma (@RGVzoomin) January 21, 2026

