Sonu Sood Praises Pawan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల మార్షల్ ఆర్ట్స్‌లో అత్యంత అరుదైన, ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ గౌరవాలను స్వీకరించిన విషయం తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన సాధించిన ప్రావీణ్యానికి గౌరవంగా ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం దక్కింది. 3 దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్ సాధన, ఆయన అంకితభావానికి ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. జపాన్ వెలుపల ఈ గుర్తింపు పొందిన అతికొద్ది మంది భారతీయుల్లో ఒకరిగా పవన్ చరిత్ర సృష్టించారు. దీంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజకీయ నాయకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు చాలామంది పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలో ప్రముఖ నటుడు సోనూ సూద్ కూడా (Sonu Sood Praises Pawan) చేరిపోయాడు. పవన్ సాధించిన ఘనతను హిందీ మాట్లాడే ఉత్తరాధి భారతీయులకు తన గొంతు ద్వారా పరిచయం చేశాడు. ఈ మేరకు మంగళవారం నాడు ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది.
Read Also- TPCC Chief: తప్పు చేశారు కాబట్టే.. లొట్ట పిసు కేసులు.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్
అదృష్టంగా భావిస్తున్నా..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని తన గొంతు ద్వారా హిందీలో అందించడం అదృష్టంగా భావిస్తున్నట్టు సోనూసూద్ చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ రంగంలో ఆయన కృషికి, దక్కిన అంతర్జాతీయ గుర్తింపునకు తాను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్టు రాసుకొచ్చాడు. దీనికి వీడియోను జత చేశాడు.
కాగా, సోనూసూద్ షేర్ చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం మొత్తం ఉంది. పవన్ మార్షల్ ఆర్ట్స్‌లోకి ఎలా ప్రవేశించారు, ఎలా నేర్చుకున్నారు, ఎలా ప్రావీణ్యం సాధించారు? అనే విషయాల నుంచి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందేవరకు అన్ని విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి.
Read Also- Harish Rao Investigation: పైనుంచి ఫోన్లు వచ్చాయ్.. సిట్ విచారణపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
It is a privilege to present, in Hindi, the martial arts journey of Power Star @PawanKalyan Garu, Deputy Chief Minister of Andhra Pradesh, through my voice. I extend my heartfelt congratulations to him on his martial arts journey and the international recognition he has achieved… pic.twitter.com/LPDA9StXoa
— sonu sood (@SonuSood) January 20, 2026

