singari-song( Image :x)
ఎంటర్‌టైన్మెంట్

Singari song release: ‘డ్యూడ్’ మరో లిరికల్ సాంగ్ తో వచ్చేశాడు.. ఎలా ఉందంటే?..

Singari song release: తమిళ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాధన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్యూడ్ (Dude)’. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘లవ్ టుడే’ తర్వాత ప్రదీప్ నటించిన ఈ చిత్రం రొమాంటిక్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిపిన యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించగా, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సోషల్ మీడియాలో హిట్ అయ్యాయి. తాజాగా మరో సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నిర్మాతలు. అదే “సింగారి” సాంగ్. ఈ పాటను ప్రదీప్ స్వయంగా పాడటంతో అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది.

Read also-Ram Gopal Varma: ‘శివ’ సినిమాపై రామ్ గోపాల్ వర్మ వైరల్ పోస్ట్.. పుట్టిన రోజా!

ఈ సినిమా కథలో ప్రదీప్ పాత్ర ఒక మాస్ అటిట్యూడ్ ఉన్న యువకుడి చుట్టూ తిరుగుతుంది. కానీ ఇందులో ప్రేమతో పాటు కుటుంబ సెంటిమెంట్ కూడా ప్రధానంగా ఉండబోతుందని సమాచారం. సినిమాకి సంబంధించిన ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ప్రదీప్, మమితా జోడీ తెరపై సూపర్ హిట్ కెమిస్ట్రీగా మారుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే “డ్యూడ్” సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కులను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకుందని సమాచారం. దీపావళి రేసులో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read also-Local Body Elections: స్థానిక అభ్యర్ధుల ఎంపికలో టీపీసీసీకి సవాల్.. రాహుల్ గాంధీ రూల్‌కు నై అంటున్న లీడర్లు

విడుదలైన పాటను చూస్తుంటే.. ఈ పాటను హీరో ప్రదీప్ రంగనాధన్ స్వయంగా ఆలపించాడు. సింగారి సిన్నదాన నీ ఇంటి దారిలోన పసోడై పాడుకోన రింగా రింగా.. అంటూ మెదలుతోంది. బిర్రాన చేరుకోన నీ ముందు నిల్చుకోన చెయ్యేసి ఎత్తుకొన బంగారంగా అంటూ సాగుతోంది. రామ్ జోగయ్యశాస్త్రి అందించిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పాట మొత్తం యూత్ కోసం రాసినట్టుగా ఉంటుంది. కాలేజీ సమయంలో జరిగిన ప్రేమ కథను వ్యక్త పరుస్తూ హీరో హీరోయిన్ కోసం ఈ పాట పాడుతూ ఉంటాడు. సాయ్ అభ్యంకర్ అందించిన సంగీతం క్యాచీగా ఉంది. సంగీతం చాలా ప్రేష్ గా అనిపిస్తుంది. ఈ పాటను స్వయంగా ప్రదీప్ పాడటంతో మంచి హైప్ వచ్చింది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. విడుదలైన పాటలు కూడా హిట్ టాక్ తెచ్చుకొవడంతో సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.

Just In

01

Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. అసలేం జరుగుతుంది?

Premante Teaser: పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా సుమ.. ‘ప్రేమంటే’ టీజర్ ఎలా ఉందంటే?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ పాయె.. మహేష్, రాజమౌళి టైటిల్ ఏంటో?

Rajasekhar: నాకు ఆ వ్యాధి ఉంది.. ఓపెన్‌గా చెప్పేసిన యాంగ్రీమ్యాన్!

Crime News: మూడు రోజుల్లో వీడిన హత్య కేసు మిస్టరీ.. ఎలా పసిగట్టారంటే?