Local Body Elections: స్థానిక సంస్థ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక టీపీసీసీకి సవాల్ గా మారింది. పార్టీలో విభిన్న అభిప్రాయాలు రావడంతో ఫిల్టర్ చేయడంలో చిక్కులు వస్తున్నాయి. నియోజకవర్గాల ఎమ్మెల్యేలు యువ నాయకులకు ప్రాధాన్యత ఇస్తుండగా, ఈ దఫా తమకే అవకాశం ఇవ్వాలంటూ సీనియర్ లీడర్లు పట్టుపట్టడం గమనార్హం. ప్రతిపక్షంలో పదేళ్ల పాటు కేసీఆర్(KCR) ప్రభుత్వంపై పోరాడమని, తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనంటూ ఓల్డ్ లీడర్లు పార్టీ ముందు ప్రపోజల్ పెట్టారు. యూత్ కే ప్రయారిటీ ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahulgandhi) ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
దీని వలన పార్టీ పదేళ్ల పాటు పవర్ లో ఉండటమే కాకుండా, లాంగ్ టర్మ్ లో ప్రయోజనం జరుగుతుందని ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. ఈ అంశంపై ఓల్డ్ లీడర్స్, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ లు ఏర్పడ్డాయి. దక్షిణ తెలంగాణలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నదని గాంధీభవన్ లీడర్లు చెబుతున్నారు. ఇదే అంశంపై పీసీసీ చీఫ్ కూడా డీసీసీలతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలోని ఆశావహులను మూడు కేటగిరీలుగా విభజిస్తూ లిస్టు కోరగా, శనివారమే గాంధీభవన్ కు పంపించినట్లు తెలుస్తోన్నది.
పార్టీ సిద్ధాంతాలతో పనిచేసే వాళ్లకే…?
ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) ఆదేశాల మేరకు టీపీసీసీ మూడు కేటగిరీలుగా లిస్టును కోరింది. కాంగ్రెస్(Congress)లో మొదట్నుంచి పనిచేసిన నేతలు, ఎన్నికల కంటే ముందు చేరిన లీడర్లు, పవర్ లోకి వచ్చాక కండువా కప్పుకున్న నేతలు.. ఇలా మూడు విభాగాలుగా లిస్టును కోరారు. వీరిలో పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసే వాళ్లకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని టీపీసీసీ(TPCC) చెబుతున్నది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. టిక్కెట్ ఎవరికి వస్తుందో స్పష్టంగా తెలియక.. క్షేత్రస్థాయిలోనూ ఎలాంటి క్యాంపెయిన్ లు, ప్రోగ్రామ్ లు ఇంకా మొదలు పెట్టలేదు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామాల్లో హాడావిడి నెలకొంటుంది. పైగా ఈ దఫా దసరా పండుగ కూడా వచ్చింది. కానీ గ్రామాల్లో ఎన్నికల వాతావరణం కనిపించడం లేదు.
Also Read: Kunamneni Sambasiva Rao: మాతో ఎవరు కలిసి వస్తారో.. ఆ పార్టీలతో ముందుకు పోతాం: ఎమ్మెల్యే కూనంనేని
మా పరిస్థితి ఏమిటీ…?
ఇతర పార్టీల నుంచి ఎన్నికల ముందు చేరినోళ్లు, పవర్ లోకి వచ్చిన తర్వాత హస్తం కండువా కప్పుకున్నోళ్లలో కొంత గందరగోళం ఏర్పడింది. గతంలో పార్టీలో చేరే ముందు కొన్ని జిల్లాల డీసీసీలతో పాటు పార్టీ అగ్రనేతలూ.. క్షేత్రస్థాయిలోని టిక్కెట్ల పై ఆయా లీడర్లకు హామీలు ఇచ్చారు. తప్పనిసరిగా టిక్కెట్లు ఇప్పిస్తామంటూ ప్రామిస్ లు చేశారు. కానీ ఇప్పుడు పార్టీ లిస్టు సేకరణ విధానం చూసి ఆయా లీడర్లు ఖంగు తిన్నారు. అసలు తమకు టిక్కెట్ ఇస్తారా? లేదా? అని టెన్షన్ పడుతున్నారు. శనివారం జరిగిన జూమ్ మీటింగ్ లోనూ ఈ అంశంపై కొంత మంది డీసీసీలు ఏఐసీసీ ఇన్ చార్జ్, పీసీసీ చీఫ్ ను వివరణ కోరారు. అందరికీ న్యాయం జరుగుతుందని అగ్రనేతలు ఈ అంశాన్ని దాటవేసినట్లు ఓ డీసీసీ చెప్పారు.
Also Read: Khammam District: కోట మైసమ్మ తల్లి జాతరకు పోటెత్తిన జనం.. ఎక్కడంటే?
